డోంట్ కేర్ అంటున్న ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్.. ఆమె స్పెషాలిటీ తెలియని వారు తక్కువే ఉంటారు. ఎన్నో తెలుగు.. హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఇలియానా ప్రస్తుతం మకాం ముంబై. తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది కానీ వర్క్ అవుట్ కాలేదు. హిందీ సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాను పెద్ద బర్నర్ ను హై ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసినట్టు గా వేడెక్కిస్తోంది.

ఇల్లీ బేబీ ఈ మధ్య అండమాన్ నికోబార్ ద్వీపాలకు హాలిడే ట్రిప్ వేసుకుంది. అక్కడ ముంజో ఓషన్ రిసార్ట్ లో విడిది చేసింది. సరదాగా గడిపింది. ఆ ట్రిప్ పూర్తయిన తర్వాత పూర్తిగా రీఛార్జ్ అయి వెనక్కు వచ్చింది. తాజాగా ఇల్లీ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “వాళ్ళు: మహిళ లాగా కూర్చో. నేను: (చేతిని పైకెత్తిన టిప్పింగ్ హ్యాండ్ ఎమోజి)” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఎమోజికి ఒక అర్థం.. అందరూ నమ్మే ఓ విషయాన్ని ప్రశ్నించడం. అంటే అలా కూర్చో.. ఇలా కూర్చో అంటే కుదరదు. నేను ఎలా కూర్చోవాలో నా ఇష్టం అని చెప్తోంది. అలానే కారులో వెనుక సీట్లో కూర్చుంది ..ముందు సీట్ పై కాళ్ళు పెట్టి.. నాలుకను బయట పెట్టి “ఐ డోంట్ కేర్’ అన్నట్టుగా పోజిచ్చింది.

డిఫరెంట్ ఫోటో కావడంతో కామెంట్లు కూడా డిఫరెంట్ గా వచ్చాయి. “డాషింగ్ లేడీ”.. “ఆధునిక మహిళ”.. “ఇలియానా: ది రెబెల్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఇల్లీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కుకీ గులాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ది బిగ్ బుల్’ అనే హిందీ సినిమా లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *