డ్రెస్సింగ్ కాపీ కొడితే తప్పు ఏమి??

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ డ్రెస్సింగ్‌ను తాను కాపీ కొడితే తప్పేంటి అని అంటున్నారు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మహీరా శర్మ. ‘బిగ్‌బాస్‌ సీజన్‌13’ రియాల్టీ షో గ్రాండ్‌ ఫినాలేను ఇటీవల వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహీరా శర్మ లేత నీలి రంగు దుస్తుల్లో హాజరయ్యారు. తన లుక్‌కు సంబంధించిన ఫొటోలను సైతం ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆమె డ్రెస్‌, హెయిర్‌ స్టైల్‌ అచ్చం ఐఫా2018లో ఆలియాభట్‌ లుక్‌ను పోలినట్లు ఉంది. దీంతో నెటిజన్లు.. ‘మహీరా శర్మ మీరు ఆలియాభట్‌ లుక్‌ను కాపీ కొట్టారు’ అని కామెంట్లు పెడుతూ సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేశారు.

రియాల్టీ షో ఫైనల్‌ వేడుకలో తాను ధరించిన డ్రెస్‌ గురించి సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై మహీరా శర్మ తాజాగా స్పందించారు. ‘నా లుక్‌ గురించి ట్రోల్‌ చేసేంత తప్పు అక్కడ ఏం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఆలియా భట్‌ యూత్‌ ఐకాన్‌. ఆమె స్టైల్‌ను నేను కాపీ కొడితే వచ్చిన ఇబ్బంది ఏంటి? నిజం చెప్పాలంటే స్టైల్‌ విషయంలో నేను తన నుంచే స్ఫూర్తి పొందాను’ అని మహీరా తెలిపారు. ‘నా గురించి కామెంట్లు చేయాలనుకున్నవారు ఇలాంటి ట్రోల్స్‌ చేస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియా అనేది ప్రశంసల కంటే విమర్శకులకు గమ్యస్థానం అవుతుంది. సోషల్‌మీడియాలో చాలామంది అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.’ అని మహీరా శర్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *