డ్రైవర్లు, పరిశుద్ధ కార్మికులు విఐపి లు :ఆప్

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది. ఆదివారం జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దాదాపు యాభైమంది సామాన్యులు కేజ్రీవాల్‌తో వేదిక పంచుకోబోతున్నట్లు ఆమ్‌ఆద్మీ నేత మనీష్‌ సిసోడియా వెల్లడించారు. రామ్‌లీలా మైదానంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అట్టడుగువర్గాల వారిని ఆహ్వానించాలని కేజ్రీవాల్‌ నిర్ణయించినట్లు తెలిపారు.

ముఖ్యంగా ఆటో, అంబులెన్స్‌, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ప్యూన్లు, మొహల్లా క్లినిక్‌ డాక్టర్లు, ఇలా వివిధ వర్గాలకు చెందిన యాభై మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్యే మాస్కో ఒలింపియాడ్‌లో పథకాలు సాధించిన విద్యార్థులు, ఉద్యోగ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను కూడా ఆహ్వానించామన్నారు. రేపు జరగబోయే కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *