తండ్రి కొడుకు తో ఆచార్య ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు మొదట రామ్ చరణ్ ను అనుకున్నారు. అయితే ‘RRR’ డిలే కావడంతో ఈ సినిమాలో నటించడం చరణ్ కు వీలు కాదని కొరటాల మరో స్టార్ హీరో కోసం ప్రయత్నించారు. సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ సినిమాలో నటింపజేసేందుకు తన వైపునుంచి ప్రయత్నిస్తే మహేష్ కూడా ఫార్మల్ గా ఓకే చెప్పారట.

అయితే ఇలాంటి పాత్రలు అరుదుగా ఉంటాయని.. చరణ్ చేస్తే ఇదో మరపురాని చిత్రంగా నిలిచిపోతుందని మెగాస్టార్ భావించారట. దీంతో చిరు- మహేష్ కాంబినేషన్ వర్క్ అవుట్ కాలేదు. ఇదిలా ఉంటే చరణ్ కూడా ఈ సినిమాలో నటించేందుకు రాజమౌళి దగ్గర అనుమతి తీసుకున్నారని సమాచారం. చరణ్ సినిమాలలో గతంలో చిరంజీవి కనిపించినప్పటికీ అవి జస్ట్ రెండు నిముషాలు లేదా ఒక పాట కోసం చేసిన క్యామియోలు మాత్రమే. అయితే ఈ సినిమాలో మాత్రం చిరు-చరణ్ కాంబినేషన్ పూర్తి స్థాయిలో ఉంటుందని అంటున్నారు.

త్వరలోనే చరణ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయంపై అధికారికంగా ప్రకటన రానుందని సమాచారం. ఇలా తండ్రి కొడుకులు ఒక సినిమాలో నటించడం మెగా ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ ట్రీట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *