తగ్గిన మారుతి సుజుకి అమ్మకాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫిబ్రవరి నెలలో కార్ల అమ్మకాలు తగ్గినట్లు ప్రకటించింది. భారత మార్కెట్‌లో 2020 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి కార్ల అమ్మకాలు 3.6శాతానికి పడిపోయిట్లు కంపెనీ పేర్కొంది. గత సంవత్సరం 139,100 యూనిట్లను విక్రయించగా, 2020లో దేశీయ మార్కెట్‌లో 134,150 యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఫిబ్రవరిలో అమ్మకాలు 1.1 శాతం క్షీణించి 1,47,110 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 1,48,682 యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ అమ్మకాలు గత నెలలో 1.6 శాతం తగ్గి 1,36,849 యూనిట్లకు చేరుకోగా, 2019 ఫిబ్రవరిలో 1,39,100 యూనిట్లు నమోదయ్యాయి.

ఆల్టో మరియు వాగన్ఆర్లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 27,499 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 24,751 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే 11.1 శాతం పెరిగాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్ వంటి మోడల్స్ 3.9 శాతం క్షీణించి 69,828 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇవే మోడల్స్ 72,678 కార్లు విక్రయించారు. 2019 ఫిబ్రవరిలో 3,084 యూనిట్లతో పోలిస్తే మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 2,544 యూనిట్లుగా నమోదు అయ్యాయి. అయితే, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 3.5 శాతం పెరిగి 22,604 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది 21,834 యూనిట్లు. ఫిబ్రవరిలో ఎగుమతులు 7.1 శాతం పెరిగి 10,261 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 9,582 యూనిట్లు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *