తమ రాష్ట్రంలో పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల విషయాన్ని తేల్చండి.. ఒడిశా గవర్నమెంట్

 

 

 

 

తమ రాష్ట్రంలో పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల విషయాన్ని తేల్చకుండా ముందుకెళ్లడం అన్యాయమని ఒడిషా పేర్కొంది.ఏ పీ కలల ప్రాజెక్టు పోలవరం.. ఉమ్మడి ఏపీలో 70ఏళ్లుగా ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం పోరాడుతున్నారు. ఆశపడుతున్నారు. తరాలు మారినా ప్రజల తలరాతలు మారలేదు.. కానీ నాయకులు మారారు. ఏ నాయకుడు కూడా ఏపీ సాగు – తాగు నీటి కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. చంద్రబాబు హయాంలో కేంద్రం సాయంతో మొదలుపెట్టినా అందులోని కమీషన్ల కక్కుర్తి – పర్సంటేజీల జాప్యంతో పూర్తి చేయలేకపోయారని ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏరికోరి ఈ కలల ప్రాజెక్టును పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. రివర్స్ టెండరింగ్ పిలిచి మేఘా సంస్థకు అప్పగించారు. కాళేశ్వరం కట్టిన ఈ సంస్థ ఇప్పుడు వడివడిగా 2021లోపే పోలవరాన్ని పూర్తి చేయాలని జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి అనుకోని షాక్ తగిలింది.

తాజాగా పోలవరం ప్రాజెక్టుకు ఏపీ పైనున్న ఒడిషా రాష్ట్రం అడ్డుపుల్ల వేసింది. పోలవరం పూర్తైతే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని.. నిర్మాణాన్ని ఆపివేయాలని ఒడిషా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం షాకింగ్ గా మారింది.

పోలవరం నిర్మాణ పనులను నిలిపివేస్తూ 2018 జూలై 10 – 2019 జూన్ 27 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఒడిషా ప్రభుత్వం అఫిడవిట్ ను దాఖలు చేసింది. తమ రాష్ట్రంలో పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల విషయాన్ని తేల్చకుండా ముందుకెళ్లడం అన్యాయమని ఒడిషా పేర్కొంది. దీంతో ఏపీ కలల ప్రాజెక్టుకు మరో విఘాతం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *