తెలంగాణా లో ఐఏఎస్ ల బదిలీలు..

తెలంగాణాలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పెద్దఎత్తున బదిలీలు చేపట్టారు. పాలనలో ప్రక్షాళన కోసం 60 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్, జగిత్యాల కలెక్టర్‌గా శరత్, వికారాబాద్ కలెక్టర్‌గా పౌసుమీ బసు, కొత్తగూడెం కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి, నారాయణ్‌పేట్ కలెక్టర్‌గా హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా దేవసేన బదిలీ అయ్యారు.

హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు, ఆసిఫాబాద్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్, నిజామాబాద్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ బదిలీ అయ్యారు. వరంగల్ అర్బన్ హనుమంతు, ములుగు కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ కలెక్టర్‌గా వెంకట్రావ్ బదిలీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *