తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన శివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే పరమశివుని నామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో నీలకంఠుడి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడల్లో భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీశైలంలోని స్వయంభుగా వెలిచిన మల్లికార్జునస్వామి-శ్రీభమరాంబదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో ఈ రోజు సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం జరగనుంది. రాత్రి 12 గంటలకు శ్రీభమరాంబదేవీ-మల్లికార్జునస్వామి వార్ల బ్రహోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *