తొమ్మిది నెలల జగన్ పాలనలో 14 ఏళ్ల సీఎం ఉక్కిరిబిక్కిరి

తొమ్మిదేళ్లతో పాటు తాజాగా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి.. తొమ్మిది నెలల పాలనకే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాడు. జాతీయ పార్టీగా ప్రకటించుకుని ప్రస్తుతం గల్లీ పార్టీ మారిపోయింది. దీంతో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర నైరాశ్యానికి గురవుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నా తానే సీనియర్ నాయకుడినని చెప్పుకునే పెద్ద మనిషి ఇప్పుడు తన కుమారుడి వయసు ఉన్నటువంటి జగన్ చేతిలో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. కక్కలేక.. మింగలేక.. బతుకు జీవుడా అనే పరిస్థితికి చేరుకున్నాడు. చంద్రబాబుకు తొమ్మిదేళ్ల జగన్ పాలనలోనే చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటు రాజకీయంగా అటు ప్రభుత్వ విధానంలోనూ చంద్రబాబును ఇరుకున పెట్టేలా జగన్ ప్రయత్నిస్తున్నట్లు పరిణామాలను చూస్తే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు కు ఆర్థికంగా అండగా ఉన్న అమరావతి మార్చేసి చంద్రబాబును ఇరుకున పెట్టారని తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్న బీసీలను కూడా జగన్ తన వైపు లాగేసుకున్నాడు. దీంతో చంద్రబాబు ఒంటరి పక్షిలా మారుతున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ టీడీపీ ని పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు వీడుతున్నారు. జై జగన్ అంటూ వైఎస్సార్సీపీ లో చేరుతున్నారు.

పథకం ప్రకారం చంద్రబాబుకు అండగా ఉన్న అంశాలను దూరం చేస్తున్నాడు. ఆ క్రమంలో రాజధాని మార్పు రిజర్వేషన్ల కూర్పు తదితర అస్త్రాలను ప్రయోగించి ప్రస్తుతం చంద్రబాబును జగన్ ఒంటరయ్యేలా చేశాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్ నాయకుడు జూనియర్ తన కొడుకులాంటి వ్యక్తి చేతిలో చతికిల పడుతున్నాడని పేర్కొంటున్నారు. జగన్ వేస్తున్న వ్యూహ్యాలకు చంద్రబాబు సాగీలపడుతున్నాడు. ప్రతీకారం ఈ విధంగా తీర్చుకుంటాడని ఏనాడూ ఊహించకపోవచ్చు. ప్రస్తుతం టీడీపీకి చంద్రబాబు కు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. కేవలం తొమ్మిది నెలల జగన్ పాలనకు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు గిలగిలలాడడం చూస్తే అందరూ ఏమి జగన్మాయ అని పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *