త్రిపాఠీ ని బుక్ చేసిన వకీల్ సాబ్?

తెలుగు చిత్ర పరిశ్రమలో సొట్ట బుగ్గల సుందరిగా పేరుగాంచిన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. తెలుగు వెండితెరకు ‘అందాల రాక్షసి ‘అనే చిత్రం ద్వారా 2012లో పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

ముఖ్యంగా, టాలీవుడ్ “మన్మథుడు” ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పైగా, నాగార్జునతో సాగించిన రొమాన్స్ సన్నివేశాల్లో అదిరిపోయాలా నటించింది. ఆ తర్వాత ఈమెకు పెద్ద సినీ అవకాశాలు రాలేదు. దీంతో తెరమరుగైంది.

ఈ క్రమంలో ఇపుడ ఈ సొట్టబుగ్గల సుందరికి బిగ్ ఆఫర్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంద‌ని.. కాదు ఇలియానా న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

తాజాగా ఈ లిస్టులో ‘అందాల రాక్షసి’ పేరు చేరింది. ఇది నిజ‌మైతే ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్ త‌ప్ప పెద్ద‌గా అవ‌కాశాలు లేని లావ‌ణ్య‌ త్రిపాఠికి మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. మ‌రి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *