దర్బార్ సినిమా లాభమా? నష్టమా? మురుగుదాస్ చుట్టూ డిస్ట్రబ్యూటర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఏ. ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్ సినిమా కొని నష్టపోయామంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దర్బార్ నిర్మాణ సంస్థ లైకా ని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీనికి సర్ధి చెప్పాల్సింది పోయి… అంతిమంగా తామే 40 కోట్లు నష్టాల్లో ఉన్నాం అంటూ లైకా చేతులెత్తేయడమే గాకుండా.. మురగదాస్ 60 కోట్లు పారితోషికం తీసుకున్నారు.. ఆయన్ని తగులుకోండి!! అంటూ తప్పించుకున్నారని వార్తలొచ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు మురుగదాస్ ఇంటిపై పడ్డారు. దీంతో తాజా సీన్ మరింతగా వేడెక్కింది. పంపిణీదారుల నుంచి తనకు హాని ఉందని.. రక్షణ కల్పించాలని మురుగదాస్ హైకోర్టును ఆశ్రయించారు.

`దర్బార్` నష్టాలకు తనని బాధ్యుడ్ని చేస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో మురుగదాస్ రివర్స్ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో ఈ వార్ ఇప్పుడు మురగదాస్ కి..డిస్ట్రిబ్యూటర్లకి మధ్యకు షిఫ్టయ్యింది. సాధారణంగా సినిమా ప్లాప్ అయి.. నష్టాలు ఎదురైతే హీరోపైనా…నిర్మాతపైనా పడతారు. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ లో ఉంది. ముందుగా డిస్ట్రిబ్యూటర్లు సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవాలని ప్రయత్నించారు. కానీ అనుమతి దొరక్కపోవడంతో లైకా ప్రొడక్షన్ పంపిణీదారుల్ని మురగదాస్ వైపు యూటర్న్ తిప్పడంతో ఆయనపై పడ్డారని తెలుస్తోంది.

తాజా వివాదంతో దర్బార్ హిట్టు అయిందో..ప్లాప్ అయిందో తెలియక మీడియా సైతం కన్ఫ్యూజన్ కు గురవుతోంది. లైకా ప్రొడక్షన్ 200 కోట్లు వసూళ్లు సాధించిందని పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేసింది. తెలుగులోనూ చక్కని వసూళ్లు సాధించినట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు బయ్యర్లు నష్టాలంటూ మురగపై పడటంతో అసలు డమ్మీ సక్సెస్ అని భావించాల్సి వస్తోంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ల బెడద నుంచి తప్పించుకోవడానికి లైకా..మురగదాస్ ఇలా కొత్త గేమ్ కి తెరలేపారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి చెన్నయ్ హైకోర్ట్ మురుగదాస్ కి రక్షణ కల్పించే పనిలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *