దిశ నిందితుడి భార్య తల్లి అయ్యింది.. ఆడశిశువుకు జననం

దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు భార్యకు ప్రసవం జరిగింది. శుక్రవారం సాయంత్రం చెన్నకేశవులు భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి కూతురు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.

దిశ ఘటన జరిగే నాటికి చెన్నకేశవులు భార్య గర్భవతి ఎన్కౌంటర్లో చెన్నకేశవులు చనిపోయిన తర్వాత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా తన కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి చెన్నకేశవులు భార్య సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది.

కాగా రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.

నవంబరు 27న దిశపై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

రెండు రోజుల తర్వాత దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అరెస్ట్ అయ్యారు. ఐతే డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురూ చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *