దేశంలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ గల సెలెబ్రెటీగా :విరాట్ కోహ్లీ

తిరుగులేని ఆట.. అదిరిపోయే ఫిట్ నెస్.. పరుగుల యంత్రం.. ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెటర్.. ఈ కొలమానాలన్నీ మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే.. క్రికెట్ లో మొనగాడు అయిన విరాట్ కోహ్లీ ఇప్పుడు సంపాదనలోనూ మొనగాడై నిలిచాడు. క్రికెట్ లో రికార్డులు బద్దలు కొట్టినట్టే ఆదాయం ప్రజాదరణలో కూడా నంబర్ 1 స్థానంలో నిలిచారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. దీంతో వరుసగా మూడో సంవత్సరం కూడా భారత దేశంలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ గల సెలెబ్రెటీగా కోహ్లీ రికార్డ్ సృష్టించారు. ‘ద డఫ్ అండ్ ఫెల్ప్స్’ అనే కంపెనీ జరిపిన సర్వేలో రూ.1690 కోట్ల బ్రాండ్ వాల్యూతో విరాట్ కోహ్లీ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన సెలెబ్రెటీగా నంబర్ 1 పొజిషన్ లో నిలిచాడు. 2018 నుంచి 2019 కి కోహ్లీ బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.

విరాట్ కోహ్లీ తర్వాత దేశంలోనే ఆదాయంలో రెండో స్థానంలో ఉన్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ఈయన 743 కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో పొజిషన్ లో ఉన్నారు.ఇక గత ఏడాది రణవీర్ -దీపికా పడుకొనే జంట 2వ స్థానంలో ఉండగా.. ఈసారి 3వ స్థానంలోకి జారిపోయారు. వారి ఆదాయం 665కోట్లుగా ఉంది.

ఇక అత్యధిక బ్రాండ్ విలువ గల భారతీయ సెలెబ్రెటీలలో ఎంఎస్ ధోని 293 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 153 కోట్లతో 15వ స్థానంలో ఉన్నారు.

మొత్తంగా టాప్ 20 సెలెబ్రెటీల బ్రాండ్ వాల్యూ 7833 కోట్లుగా ఉంది. 5 – 6 స్థానాల్లో షారుఖ్ – సల్మాన్ ఖాన్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *