ధనుశ్ కు మధురై కోర్టు షాక్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుశ్ అసలు తల్లిదండ్రులం తామేనంటూ తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన కదిరేశన్ – మీనాక్షీ దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో మందలించడంతో ఇంటి వెళ్లిపోయిన తమ కొడుకే ఇప్పటి స్టార్ హీరో ధనుశ్ అంటూ వారు కోర్టును ఆశ్రయించారు. తమకు నెలకు రూ.60 వేల భృతిని ఇప్పించాలని కోర్టును కోరారు. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా ధనుశ్ కు మధురై కోర్టు షాకిచ్చింది. ఇప్పటివరకు ధనుశ్ ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్స్ – రెసిడెన్స్ – ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ను ఎందుకు సమర్పించలేదంటూ ధనుశ్ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా15 రోజుల్లో అడిగిన సర్టిఫికేట్స్ ను అందించాలని చెన్నై కోర్టు ఆదేశించింది.

గతంలో పుట్టుమచ్చల వ్యవహారంలో ధనుశ్ కు కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. తన శరీరంపై పుట్టుమచ్చలను ధనుశ్ చెరిపేశారని – వైద్యులు కోర్టుకు సంచలన నివేదిక ఇచ్చారు. ధనుష్ భుజపుటెముక మీద ఉన్న పుట్టుమచ్చను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా – మోచేతి మీద ఉన్న పెద్ద మచ్చను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించినట్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ధనుశ్ బర్త్ – రెసిడెన్స్ – స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సదరు సర్టిఫికెట్ కాపీలను ధనుశ్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే కదిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ధనుశ్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు లేవని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కదిరేశన్ – మీనాక్షి దంపతులు ధనుశ్ కి డీఎన్ ఏ పరీక్ష చేస్తే అసలు నిజం తెలుస్తుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *