నటన వేరు… జీవితం వేరు అన్న కాజల్

కాజల్ అగర్వాల్.. ఈ అందాల మెరుపుతీగను తెలుగుకు తేజ పరిచయం చేసినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది.

స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్.

ఈ భామ తాజాగా మీడియాతో తన సినీ జీవితం, నిజ జీవితం గురించి మాట్లాడుతూ.. నా నిజ జీవితం వేరు, నేను పోషించే పాత్రలు వేరు. ఆ రెండింటినీ వేర్వేరుగా చూడటానికే ఇష్టపడతా. నేను పోషించిన పాత్రల్లాగా నిజ జీవితంలో ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నాకంటూ ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. అదంటే నాకు చాలా ఇష్టం.. దాన్ని ఎప్పుడూ వదులుకోను అంటూ చెప్పికొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *