నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ కొత్త సినిమా

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైజయంతి మూవీస్‌ ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో మేమెంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కోసం ప్రభాస్‌తో కలిసి పనిచేయడం మాకెంతో గౌరవంగా ఉంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్‌.. రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. వింటేజ్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ‘జాన్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కృష్ణంరాజు కీలకపాత్రలో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *