నారాయణ, చైతన్య కళాశాలలుపై తెలంగాణా హైకోర్టు సీరియస్

విద్యను వ్యాపారమయం కావడానికి ప్రధాన కారణం నారాయణ – శ్రీచైతన్య సంస్థలే. ఈ సంస్థలు విద్యారంగంలో ప్రవేశించినప్పటి నుంచి విద్య కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడికి అందనంత ఎత్తులో విద్య ఉంది. భారీగా ఫీజులు తీసుకుంటూ నాసిరకం చదువులు చెబుతున్నారని – ప్రతిభ గల విద్యార్థులను 24 గంటలను చదివిస్తూ ర్యాంకుల వ్యాపారం చేస్తుండడంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారమే ధ్యేయంగా వచ్చిన ఆ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఏనాడూ పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా కళాశాలలను ఏర్పాటు చేస్తుండడంతో ఉన్నత న్యాయస్థానం స్పందించింది. వెంటనే ఆ నిబంధనలు పాటించని 68 శ్రీచైతన్య నారాయణ కళాశాలలను వెంటనే మూయించేయాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్కు ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేట్ కళాశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడంతో హైకోర్టు విచారించింది. అందులో భాగంగా శ్రీచైతన్య – నారాయణ జూనియర్ కళాశాలల్లో సరైన భద్రత లేదని – ఫైర్ సేఫ్టీ – పరిశుభ్రతను పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పిటిషన్ దారులు తెలిపారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్లో పేర్కొన్నారు. దీనిపై ఫిబ్రవరి 17వ తేదీన విచారణ చేసిన ధర్మాసనం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య ఏదైనా సమ్మతి కుదిరిందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నించింది. ఫిర్యాదులు అందినప్పటికీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ చర్యలు తీసుకోకపోవడంతో న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ నుంచి గుర్తింపు లేకుండానే శ్రీ చైతన్య – నారాయణ సంస్థలు 29800 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడాన్ని గుర్తించిన హైకోర్టు వారి తీరపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ నుంచి కళాశాలలకు ఎలాంటి అనుమతులు లేదా గుర్తింపు లేకుండా శ్రీచైతన్య – నారాయణ సంస్థలు పలు ప్రాంతాల్లో కళాశాలలను ఏర్పాటుచేసి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినట్లు తెలంగాణ హై కోర్టు గుర్తించి విచారణకు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారణ చేపట్టింది. మార్చిేదీ తర్వాత అంటే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన తర్వాత శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మిగతా విద్యాసంస్థలపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డుకు తెలిపింది. త్వరలోనే మరిన్ని కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చివరకు ఈ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *