నా పెళ్లి విషయంలో రూమూర్స్ మాములే :స్వీటీ

ప్రభాస్, అనుష్క పేర్లు వినపిస్తే చాలు.. వాళ్ల పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నే ఎదురవుతుంది. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నా వీళ్లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వినిపించడం..
ప్రభాస్‌తో రిలేషన్‌షిప్‌పై స్పందించిన అనుష్క శెట్టి.. ప్రభాస్, అనుష్క పేర్లు వినపిస్తే చాలు.. వాళ్ల పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నే ఎదురవుతుంది. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నా వీళ్లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వస్తూనే ఉంటాయి.

ఎందుకంటే వీరిద్దరికి ఇంకా పెళ్లి కాకపోవడమే. ప్రభాస్‌కు అప్పట్లో ఓ అమ్మాయితో సెట్ అయ్యిందని, అనుష్క ఓ దర్శకుడి కుమారుడితో లవ్ ఎఫైర్ నడిపిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను వారిద్దరు ఖండించారు కూడా. కానీ.. ప్రభాస్, అనుష్క లవ్ అంటూ వార్తలు ఆగడం లేదు. దీంతో అనుష్క మరోసారి ప్రభాస్‌తో ఉన్న బంధంపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ‘నాకు 15 ఏళ్లుగా ప్రభాస్ తెలుసు. తెల్లవారుజామున 3 గంటలకు కూడా అతనితో మాట్లాడే సాన్నిహిత్యం ఉంది. ప్రభాస్‌కు పెళ్లి కాకపోవడం, నాకూ పెళ్లి కాకపోవడంతో.. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే.. ఇప్పటికే తెలిసేది. మేమే చెప్పేవాళ్లం. కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. మా ఇద్దరి మనస్తత్వం ఒకటే. ఇద్దరికీ భావోద్వేగాలు ఎక్కువ’ అని అనుష్క స్పష్టం చేసింది.

కాగా, బిల్లా, మిర్చి, బాహుబలి రెండు పార్టుల్లో ప్రభాస్ సరసన నటించిన అనుష్క నటించింది. ఈ సినిమాల్లో వీరిద్దరి జంట బెస్ట్ జోడీగా నిలిచింది. అభిమానులు కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండు..! అని అనుకుంటున్నారు. కానీ, తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరోసారి బయటపెట్టడంతో పెళ్లివార్తలు రూమర్లు అని తేలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *