నిర్భయ నిందితుల మరో ఎత్తుగడ

నిర్భయ దోషుల చావు గడియ దగ్గరపడింది. వారి ఉరికి రోజులు దగ్గరపడ్డాయి. మార్చి 20న నలుగురు నిర్భయ దోషులను ఉరితీయడానికి కోర్టు నిర్ణయించింది. దీంతో చావు కళ వారిలో భయాందోళన కు కారణమవుతోందట..

నిర్భయ నలుగురు నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందు కు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో కొత్త పిటీషన్లు క్షమాభిక్ష అభ్యర్థనలు చేసుకుంటూ ఆపే ప్రయత్నాలకు మళ్లీ తెరలేపారు. నిర్భయ నిందితులు ఇప్పటికే మూడు సార్లు ఇలా ఉరిని వాయిదా వేసుకున్నారు. తాజాగా మార్చి 20న ఉదయం 5.30 గంటలకు మరోసారి నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ పాటియాలా కోర్టు డెడ్ లైన్ విధించింది.

ఉరిని ఎలాగైనా తప్పించుకోవాల ని యోచిస్తున్న నిర్భయ నిందితులు ఇన్నాళ్లుగా ఒకరి తర్వాత ఒకరు వ్యూహాత్మకంగా పిటీషన్లు వేస్తూ క్షమాభిక్ష కోరుతూ జాప్యం చేశారు. కానీ ఇప్పుడు అంతిమ గడియలు వచ్చేశాయి. వారి ఉరికి ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయాయి.

ఈ నేపథ్యంలోనే నిర్భయ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ తాజాగా తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అభ్యర్థన పెట్టుకున్నాడు. తనలో మార్పు వచ్చిందని.. తన కుటుంబ సామాజిక ఆర్థిక స్థితి ప్రకారం శిక్ష తగ్గించాల ని విన్నవించాడు.

కాగా నిర్భయ దోషులకు ఉరి కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. నిర్భయ తల్లి అయితే జాప్యంపై కన్నీళ్ల పర్యంతమవుతోంది. ఎలాగైనా సరే మార్చి 20న ఉరిపడుతుందనుకుంటే మరోసారి నిందితుడు గవర్నర్ కు అర్జీ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే నిర్భయ దోషులకు చాలాసార్లు ఉరి ఆగిపోయింది. ఏడేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా అన్ని అవకాశాలు ముగియడం తో నలుగురిని మార్చి 20న ఉరితీయడం ఖాయమా? లేదా అనేది తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *