నిర్భయ హంతకుల ఉరికి మరో డేట్ ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన హంతకులకు డెత్ వారెంట్ ఇష్యూ చేసింది అక్కడి కోర్టు.

ముఖేష్ సింగ్ అక్షయ్ ఠాకూర్ వినయ్ శర్మ పవన్ గుప్తా అనే నలుగురు హంతకులనూ ఉరి తీయడానికి ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ ఇష్యూ చేసింది.

మార్చి మూడో తేదీని అందుకు తేదీగా నిర్ధారించింది. మార్చి మూడో తేదీ ఉదయం ఆరు గంటలకు వారిని ఉరి తీయాలని వారెంట్ లో న్యాయస్థానం పేర్కొంది.

అయితే వారికి డెత్ వారెంట్ జారీ కావడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. మూడో సారి డెత్ వారెంట్ జారీ అయ్యింది.

ఇది వరకే వారి ఉరికి డేట్ ను ప్రకటించింది న్యాయస్థానం. జనవరి 22న వారిని ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడింది.

ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించారు. అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో మూడో సారి డెత్ వారెంట్ విడుదల అయ్యింది.

మార్చి రెండో తేదీన ఉరి శిక్ష అమలు చేయాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *