పార్టీ మారినా కష్టాలు తప్పడం లేదు.. సుజనా చౌదరి కి

కేంద్ర మంత్రిగా ఉండగా రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. జరిగిన రాజకీయ పరిణామాలు ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశాడు.. ఒకప్పుడు మిత్ర పక్షంగా ఉన్న పార్టీలోకి చేరారు. అయితే ఆయన చేరిక వ్యక్తిగత కారణాలతోనే అందరికీ తెలిసినా.. ప్రభుత్వ పాలనను చూసి చేరానని పైకి వెల్లడించారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నా ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. దేనికోసమైతే చేరాడో.. ఆ పరిస్థితులు మారకపోవడంతో ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఆయనే మాజీ కేంద్రమంత్రి.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.

బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా సుజనాచౌదరి కొనసాగుతున్నా కాలం కలిసి రావడం లేదు. అధికార పార్టీలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించాడు. కేంద్రం అండదండలు ఉంటాయనుకుని కలలు కన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆయన కలలను కల్లలు చేస్తున్నాయి. చంద్రబాబు ను విబేధించి బీజేపీ లో సుజన చేరగా ఆయనకు కష్టాలు ఎదురవుతున్నాయి. బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఆగడం లేదు. రుణాలు ఎగ్గొట్టిన కేసుల్లో ఆస్తుల వేలం దాకా పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన ఏం చేయాలో పాలు పోవడం లేదు.

ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నా 2014లో సుజనా చౌదరి వెలుగులోకి వచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సుజనా చౌదరిని రెండుసార్లు రాజ్యసభకు పంపించారు. ఆ సమయంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉండడంతో 2014లో ఏర్పాటైన మోదీ తొలి ప్రభుత్వం లో మంత్రిగా పని చేశారు. వ్యవహరించారు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న సమయం లో చంద్రబాబు వెంట సుజనా చౌదరి ఉన్నాడు. ఏపీలో ప్రభుత్వం లేకపోవడం.. కేంద్రంతో తెగదెంపులు రావడంతో సుజనా కు కష్ట కాలం వచ్చింది. దీంతో వెంటనే నరేంద్ర మోదీని కలిసి బీజేపీ లో చేరిపోయాడు.

అయినా ఆయనకు కష్టాలు తప్పడం లేదు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ గతంలో తీసుకున్న సుమారు రూ.400 కోట్ల రుణం బకాయిలను సక్రమంగా చెల్లించక పోవడం తో దానిపై బ్యాంక్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ రుణం తీసుకున్నప్పుడు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సిద్ధమైంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పొరేట్ బ్రాంచి పేరిట నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సుజనా ఆస్తులను వేలం వేసేందుకు పత్రిక ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *