పీకేకు మరో పార్టీ ఆహ్వానం

ఆయన స్ట్రాటజిక్.. ఆయన చేసే పని.. ఆయన సంస్థ చేస్తున్న పనులతో అధికారం ఈజీగా వచ్చేస్తోంది. ఇవి పలుమార్లు నిరూపితమైంది. ఉత్తరాది నుంచి దక్షిణాది ఢిల్లీ నుంచి గల్లీ దాక ఆయన వ్యూహం ఫలితం ఎన్నికల్లో ఆయన పని చేసిన పార్టీలు వ్యక్తులు అనూహ్య ఫలితాలు సాధించారు. అధికారానికి దూరమైన వారికి మళ్లీ చెంత చేరుస్తుండడంతో ఇప్పుడు అతడిని పలు పార్టీలు ప్రసన్నం చేసుకుంటున్నాయి. నువ్వు రా అయ్య.. మా పార్టీని గెలిపించు.. రా అని ఆహ్వానిస్తున్నారు. మా పార్టీకి కూడా ఎలాగైన విజయావకాశాలు తీసుకురా అని కోరుతున్నారు.. విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయనే ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.

ఆంధ్రపదేశ్ లో వైఎస్ జగన్ మహారాష్ట్రలో శివసేన ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయం సాధించడంతోపాటు గతంలో ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నిక ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారం తదితర ఫలితాలు సాధించడంతో అందరి దృష్టి ప్రశాంత్ కిశోర్ పై పడింది. తాజా ఫలితాలతో పీకేను ప్రధాన రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. తమ పార్టీ కోసం పని చేసి పెట్టు అని కోరుతున్నారు. ఎన్నికల వ్యూహలు రచించి తమకు అధికారం వచ్చేలా చేయమని కోరుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తమిళనాడులో డీఎంకేతో ప్రశాంత్ కిశోర్ కలిసి పని చేస్తున్నాడు. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

తాజాగా పీకేను మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆహ్వానిస్తున్నారు. కర్నాటకలో కొన్ని కుట్రలతో అధికారం నుంచి దూరమైన కుమారస్వామి ఈసారి ఎన్నికల ద్వారానే అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. ఎప్పుడు ఇతరులతో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకోవడం కాదు.. ఈసారి పూర్తిస్థాయి ప్రభుత్వం తాము నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈసారి జేడీఎస్ ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2023లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆలోపు పార్టీని సిద్ధం చేసి ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్ లో మాజీ ప్రధాని దేవెగౌడ మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు.

ఈ విషయమై తాజాగా జేడీఎస్ నేత కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం ప్రశాంత్ కిశోర్తో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. తొలి విడత చర్చలు జరిగాయని మిగతా అంశాలను తర్వాత వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లు పొంది కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అధికారానికి దూరమయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 28 సీట్లలో ఒకటే గెలుపొందడం గతేడాది డిసెంబర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 స్థానాల్లో ఒకటే గెలవడంతో ఆ పార్టీ నిరాశకు గురయ్యింది. పార్టీ పూర్వ వైభవానికి మళ్లీ అధికారంలోకి వచ్చేలా సేవలు అందించాలని కుమారస్వామి ప్రశాంత్ కిశోర్ ను కోరినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *