పులివెందుల టీడీపీ ఖాళీ అయినట్టే.. త్వరలోనే సతీశ్ జంప్!!

అధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉండలేకపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే తమ భవిష్యత్ ఉండదని ఆ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నాయకులు రాజకీయంగా కనుమరుగు కావడమో లేదా ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు పార్టీలోని కీలక నాయకుడు సతీశ్ కుమార్ రెడ్డి త్వరలోనే పార్టీ వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్లితే ఇక పులివెందులలో ఆ పార్టీ కనుమరుగైనట్టే.

పులివెందుల నియోజకవర్గమంటే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సతీశ్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో కీలక నేతగా ఉన్న సతీశ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు గుడ్బై చెబుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కొద్ది రోజులుగా ఆయన పార్టీ అధిష్టానం పై అసంతృప్తి తో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *