పూజ ఫ్లాష్ బ్యాక్ పిక్స్ బయటికి తీసిన అభిమానులు

ఒక్కో హీరోయిన్ కు ఒక్కోదశలో పీక్ స్టేజ్ ఉంటుంది. ప్రస్తుతం పూజా హెగ్డేకి అలాంటి హవానే నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా తో ఓ భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. చేతిలో కూడా క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అందరూ సీనియర్లు కావడంతో పూజానే అందరికీ ఫస్ట్ ఛాయిస్ గా మారింది.

పూజా గ్లామర్ సంగతి అందరికీ తెలిసిందే. నటన విషయంలో పూజకు తక్కువ మార్కులు పడతాయేమో కానీ గ్లామర్ విషయంలో సాధారణ ప్రేక్షకులు వందకు వంద మార్కులు వేస్తారు. ఇక క్రియేటివ్ గ్లామర్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు పూరి జగన్నాధ్ లాంటి వారిని అడిగితే వందకు పైన మరో ఇరవై ముప్పై మార్కులు వేయడం ఖాయం.

ఇలాంటి భామ కాబట్టే సోషల్.. మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక గ్లామరస్ ఫోటో వైరల్ అవుతూ ఉంటుంది. ఈమధ్య పూజ ఫ్లాష్ బ్యాక్ ఫోటో ఒక దాన్ని అభిమానులు వెలికితీసి మరీ అందాల ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ఫెమినా మ్యాగజైన్ కోసం ఈత కొలను వద్ద పూజ ఓ అందమైన బికినీలో తడితడిగా వడ్డించిన అందాలను చూసి ఈ ప్రపంచానికి ఎదురైన కరోనా కష్టాలను కూడా మర్చిపోతున్నారు.

ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే అందం అనే పదానికి అర్థం తెలుస్తుంది. మేకప్ వేసుకుని జఫ్ఫా భామలు కూడా మిస్ ఇండియాల తరహాలో పోజులు కొట్టొచ్చు కానీ బికినీలు.. ఈతకొలను లో తడి ఫోటోలకు మాత్రం వారు సరిపోరు.

అందుకు రియల్ బ్యూటీ కావాలి. ఆ అందం ఈ అల భామ దగ్గర టన్నుల్లో ఉంది. ఇక ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *