పూరి దర్శకత్వంలో తెరకు ఎక్కుతున్న ఫైటర్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబై లో చిత్రీకరణ ప్రారంభించి..తొలి షెడ్యూల్ ని ముగించేస్తున్నారు. విజయ్..ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే హీరోయిన్ విషయంలో కొన్ని నెలలుగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ని దించాలని పూరి గట్టి ప్రయత్నాలే చేసారు. అమ్మడు బిజీగా ఉన్నా… డేట్లు సర్ధుబాటు చేసే పరిస్థితి లేకపోయినా.. జాన్వీని కాకా పట్టేందుకు ముంబైలోనే సెట్ వేసి అక్కడే ఫైటర్ ని తెరకెక్కిస్తున్నాడు. జాన్వీని ఎలాగైనా కన్విన్స్ చేయాలని తన చుట్టూ తిరిగేస్తూ గట్టిగా ట్రై చేసారు.

పైగా పూరి హీరోయిన్ల విషయంలో జాన్వీ పేరు ఒక్కటే ఎక్కువగా వినిపించడంతో ఇక ఖాయమేనని అంతా అనుకున్నారు. కానీ పూరి చేసిన ఆ ప్రయత్నాలేవి పలించలేదు. చివరికి రాజీ పడి మరో బాలీవుడ్ భామను ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2` చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన అనన్య పాండేను ఎంపిక చేసినట్లు పూరి టీమ్ ప్రకటించింది. అలాగే అమ్మడు పూరి టీమ్ తో కలిసి ఉన్న ఫోటోలను కూడా యూనిట్ అభిమానులతో పంచుకుంది.

కథా చర్చల్లో పూరి-చార్మి-విజయ్ పక్కనే అనన్య పాండే ప్రత్యక్షమైంది. ఎట్టకేలకు ఫైటర్ హీరోయిన్ ఫిక్సైంది కాబట్టి చాలా వరకూ క్లారిటీ వచ్చేసినట్టే. ఇక అనన్య పాండే తెలుగు ఆడియెన్ కు ఇప్పటికే సుపరిచితురాలు. ప్రభాస్ `సాహో` విలన్ చుంకీ పాండేకు అనన్య స్వయానా డాటర్. ఈ యంగ్ బ్యూటీ పూరి కాంపౌండ్ లో పడింది కాబట్టి ఇక క్యూటీ పేరు సౌత్ లో మార్మోగిపోవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *