పెళ్లయ్యాకా అదే హాట్ నెస్

హీరోని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన కథానాయికల జాబితా పెద్దదే. ఆ లిస్ట్ లో సయేషా సైగల్ పేరు చేరింది. తమిళ హీరో ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉత్తరాది అమ్మాయిగా రికార్డులకెక్కింది. బాలీవుడ్ క్లాసిక్ స్టార్ సైరా భాను నటవారసురాలిగా సినీరంగప్రవేశం చేసిన సయేషా సైగల్ కెరీర్ పరంగా ఆశించినంత పెద్ద స్థాయికి ఎదగలేకపోయింది.

అక్కినేని హీరో అఖిల్ సరసన డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమా పరాజయంతో అటుపై ఇక్కడ అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత తమిళంలో కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. ఆ క్రమంలోనే ఆర్య సరసన భలే భలే మగాడివోయ్ రీమేక్ గజనీకాంత్ లో నటించింది. అటుపై బ్యాచిలర్ హీరో ఆర్యతో లవ్ లో పడింది. వరుసగా మూడు నాలుగు సినిమాలకు ఆ ఇద్దరూ జంటగా నటించడం అటుపై పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

ఆర్య-సయేషా జంట ఐడియల్ కపుల్ గా పాపులరయ్యారు. మ్యారేజ్ తర్వాతా సయేషా ఎందులోనూ తగ్గడం లేదు. అమ్మడిలో హాట్ కంటెంట్ ఏమాత్రం తగ్గినట్టే లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ థై స్లిట్ డ్రెస్ లో ఆ ఫోజు చూస్తుంటే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇకపైనా బుల్లితెర షోలు.. వెబ్ సిరీస్ లు.. ఓటీటీ అంటూ బోలెడన్ని అవకాశాలు ఎలానూ ఉన్నాయి కాబట్టి సయేషా ఆ దిశగా ఆలోచిస్తోందా? అన్నది చూడాలి. పెళ్లయ్యాకా అనుష్క శర్మ- దీపిక పదుకొనే- సమంత స్టార్లుగా కొనసాగుతున్నారు. నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. మరి సయేషా ప్లాన్స్ ఏమిటో ఆర్యనే చెబుతాడేమో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *