పెళ్లైన వ్యక్తితో ఆ సంబంధం అస్సలు పెట్టుకోకూడదు :నినా గుప్తా

ప్రముఖ హిందీ నటి నీనా గుప్తా తాజాగా తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను తన అభిమానులతో పంచుకుంది. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన నీనా.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్‌ రిచర్డ్స్‌తో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో అప్పట్లో వీరిద్దరి గురించి రోజూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉండేది. అయితే ఆమె రిచర్డ్స్‌తో డేటింగ్ చేసే సమయానికి ఆయనకు అప్పటికే పెళ్లైంది. ఈ విషయం ఆమెకు తెలిసినా కూడా వీరిద్దరూ చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తూ సహజీవనం చేసారు. సహజీవనం ఫలితంగా నీనా గర్భం దాల్చింది. దీంతో పెళ్లి కాకుండానే 1989లో నీనా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా. కాగా నీనా తన జీవితంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆమె నేర్చుకున్న గుణపాఠాన్ని తాజాగా అభిమానులతో ఓ వీడియో ద్వారా షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఏదేమైనా సరే కానీ.. పెళ్లైన వాడితో మాత్రం ఎలాంటి రిలేషన్ షిప్ పెట్టుకోవద్దని సూచించింది. పెళ్లైనవారు మొదట తన భార్య అంటే ఇష్టం లేదంటారు. ఇక తన భార్యతో కలిసి ఉండలేం అని చెప్తాడు. దీంతో నువ్వు నిజమేనని నమ్మి ఆయన్ను ప్రేమిస్తావు.అంతే ఇక..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *