పొగిడితే నేల మీద పడుకొంటాను :మెగాస్టార్

తెలుగులో ఇండస్ట్రీలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోయి మెగాస్టార్‌గా మారాడు చిరంజీవి. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా తల్లో నాలుకగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఎంతో మంది కథానాయలకు స్పూర్తిగా నిలస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాాజగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఎవరైనా పొగిడితే.. ఏం చేస్తారనే దానికి చిరంజీవి ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఎవరైన నన్ను పొగిడితే నేను పొంగిపోను. సినిమా వేడుకల్లో నన్ను బాగా పొగిడితే.. ఇంటికి వెళ్లి నేల మీద పడుకుంటాను. ఎందుకంటే పొగిడితే గర్వం వస్తోంది. అది రాకుండా ఉండాలంటే నేల మీద పడుకొంటాను. నేను నేల పడుకొనే ఈ స్థాయికి చేరుకున్నాననే విషయం నాకెప్పుడు గుర్తుండాలనే అలా చేస్తుంటాని చెప్పుకొచ్చారు.

ఏదైనా సినిమా విజయం సాధించినపుడు అది నా గొప్పతనం ఎంత మాత్రం కాదు. దీని వెనక ఎంతో మంది కళాకారుల శ్రామికులు సమిష్టి కృషి ఉంటుంది. ఎవరైనా విమర్శించినా ఆ చిత్రానికి సంబంధించి అందరు ఫెయిల్ అయ్యామని నమ్ముతాను. ఈ రెండు విషయాల్లో నేను ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తుంటాను. అందుకే విజయాలు వచ్చినా పొంగిపోను. అపజయాలు పలకరిస్తే కృంగిపోనన్నారు. ప్రస్తుతం చిరంజీవి ..కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *