పోర్న్‌ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె..

ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కుమార్తె మికేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ ఎంట్రీని ఆరంభించాలని నిర్ణయించుకున్న 23 ఏళ్ల మికేలాను స్పీల్‌బర్గ్‌ ఆయన భార్య కేట్‌ కాప్షా దత్తత తీసుకున్నారు. మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన స్ర్టిప్‌ క్లబ్‌లో ఎంట్రీ కోసం​ స్ర్టిప్పర్‌ లైసెన్స్‌ పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మికేలా తన స్టేజ్‌ నేమ్‌ను షుగర్‌ స్టార్‌గా ఎంచుకున్నారని ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ వెల్లడించింది.

ఈ వృత్తి పట్ల వ్యామోహం ఉండటం సిగ్గుపడే విషయం ఎంతమాత్రం కాదని, తానిప్పుడే అడల్ట్‌ వినోద కెరీర్‌ను చేపట్టానని ఇది సానుకూల, సాధికారిక నిర్ణయమని అన్నారు. సురక్షిత, పరస్పర అంగీకారమైన పనులు చేపట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తన నిర్ణయానికి తల్లితండ్రులు విస్మయం చెందలేదని చెప్పుకొచ్చారు. కాబోయే భర్త చక్‌ పాంకో (47) సైతం పోర్న్‌ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. కాగా, చిన్నతనంలో తాను కుంగుబాటుకు గురయ్యానని లైంగిక వేధింపులకు లోనయ్యానని ది సన్‌తో మాట్లాడుతూ ఆమె వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *