పోలవరం నిర్మాణం చేయాల్సింది చాలా ఉంది : పార్లమెంటులో కేంద్రం ప్రకటన

పోలవరం నిర్మాణం చేయాల్సింది చాలా మిగిలుంది: పార్లమెంటులో కేంద్రం ప్రకటన.

లోక్ సభలో విజయవాడ ఎంపి కేసినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పోలవరం ప్రాజక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని పార్లమెంటుకు తెలిపిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. 2016 సెప్టెంబర్‌ 30 నాటి కేంద్ర ఆర్ధిక శాఖ లేఖ ద్వారా 100 శాతం పోలవరం ప్రాజక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుంది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి పోలవరం ప్రాజక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు ప్రతి పైసాను.. కేంద్రం తిరిగి చెల్లిస్తుంది.
కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం ఆమోదం ప్రకారం మొత్తం 8614.16 కోట్ల రూపాయలు కేంద్ర ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. దీనిలో గత నెలలో విడుదల చేసిన 1850 కోట్లు కూడా ఉన్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి. పోలవరంపై 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చు ఆడిట్‌ నివేదికలు అందించాలని ఇప్పటి వరకు రెండు లేఖలు రాసినట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి. 2013-14 ధరల ప్రకారం… సవరించిన అంచనాలు కూడా అందించాలని ఆ లేఖల్లో ప్రస్తావించినట్లు కేంద్ర జలశక్తి శాఖ వివరించింది. 2018 జులై 26న, 2019 మే 6న రాసిన రెండు లేఖలకు రాష్ట్రం ఇప్పటి వరకు స్పందించలేదన్న మంత్రి. ఆడిట్‌కి సంబంధించిన అన్ని వివరాలు అందించే వరకు తదుపరి నిధులు విడుదల చేయడం కుదరదని గత ఏడాది నవంబర్‌ 26న కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్రానికి మరోలేఖ రాసినట్లు పేర్కొన్నారు. గత ఏడాది మే 7న రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీకి లేఖ రాసిన కేంద్ర జల సంఘం,
2013-14 ధరల ప్రకారం 54వేల 446.1 కోట్లకు సవరించిన అంచనాలు పంపినట్లు జల సంఘం తన లేఖలో పేర్కొన్నట్లు సభకు తెలిపిన మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం.. మొత్తం తాత్కాలికంగా 5175.25 కోట్లకు గాను.. 3777.44 కోట్లకు ఆడిట్‌ పూర్తి అయ్యింది. మిగిలిన మొత్తాన్ని విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాలపై ఆధారపడి ఉంటుంది. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాధానం ఇచ్చిన మంత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *