ప్రతి బ్యాంక్ కస్టమర్ కేవైసీ పూర్తి చేసుసుకోవాలని: స్టేట్ బ్యాంక్

  1. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు అకౌంట్ ఉందా? సేవింగ్స్ ఖాతా మాత్రమే కాకుండా ఇతర అకౌంట్లు కలిగి ఉన్నారా? అయితే మీకు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలేలి. లేదంటే వచ్చే కొన్ని రోజుల్లో సమస్య ఎదుర్కోవలసి రావొచ్చు. ఈ సమస్య మీకు రాకుండా ఉండాలి అంటే ప్రతి బ్యాంక్ కస్టమర్ కూడా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుసుకోవాలని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

దీనికి సంబంధించి పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేసింది. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని బ్యాంకింగ్ సర్వీసులును ఎలాంటి ఆటంకం లేకుండా పొందాలని సూచించింది. ఇటీవల కాలంలో బ్యాంకులు తమ కస్టమర్ల కేవైసీ అప్ డేట్ కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంకులు కస్టమర్ కేవైసీ నిబంధనలు అతిక్రమిస్తే ఆర్ బీఐ వీటికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. ఖాతాదారులు బ్యాంక్ కు వెళ్లి పాస్ పోర్ట్ – ఓటర్ కార్డు – డ్రైవింగ్ లైసెన్స్ – ఆధార్ కార్డు – పాన్ కార్డు – ఎంఎన్ ఆర్ ఈజీఏ కార్డు – ఎన్ పీఆర్ లెటర్ వంటి వాటిల్లో ఏ డాక్యుమెంట ఇచ్చి కేవైసీ ని చేపించుకోవచ్చు.బ్యాంకు ఇచ్చిన గడువు లోపల కేవైసీ పూర్తీ చేసుకోకపోతే నాన్ కేవైసీ బ్యాంక్ అకౌంట్లు పనిచేయకపోవచ్చని – స్తంభింపజేస్తామని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అందువల్ల మీరు మీ అకౌంట్ కు పూర్తి కేవైసీ కలిగి ఉన్నట్లయితే ఇబ్బందులు ఉండవు. లేదంటే వెంటనే కేవైసీని పూర్తి చేసుకోండి. బ్యాంక్ నుంచి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని అలర్ట్ పొందిన వారు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం మంచిది. ఫిబ్రవరి 28లోగా అవసరమైన డాక్యుమెంట్లు అందజేసి కేవైసీ వివరాలను అప్ డేట్ చేసుకోవాలి SBI తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *