ప్రభాస్ జార్జియా షెడ్యూల్ పూర్తి

బాహబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అతడి సినిమాలకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ ప్రేక్షకులను అలరించినపోయినా.. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఒక్క హిందీలోనే ఈ సినిమాకు రూ. 200 కోట్ల వరకు కొల్లగొట్టింది. ప్రస్తుతం ప్రభాస్..

రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాాజాగా ఈ సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్ కంప్లీటైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించాడు. జార్జియన్‌ల సహాయంతో ఈ షెడ్యూల్ త్వరగా పూర్తైయిందన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *