ప్రముఖులు ప్రయాణాలుతో ఎయిర్ ఇండియా ఇక్కట్లు.. !!

వీవీఐపీ ల ప్రయాణాలతో ఎయిర్ ఇండియా త్రీవ ఇబ్బందులు ఎదురుకొంటుది.. hప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇప్పటికే తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతోంది. దీనికి తోడు ప్రముఖుల ప్రయాణ ఖర్చు కూడా భారంగా మారింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు పర్యటనలకు ఎయిరిండియా వీవీఐసీ ఛార్టర్‌ విమానాలను ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించిన ఖర్చులను సంబంధిత మంత్రిత్వశాఖలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో సుమారు రూ.822కోట్లు బకాయిలు పేరుకుపోయాయట. ఈ విషయాన్ని ఎయిరిండియానే చెప్పింది.

వీవీఐపీ ప్రయాణాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బకాయిలు ఉన్నాయో తెలపాల్సిందిగా లోకేష్‌ బాత్రా అనే వ్యక్తి సహచట్టం ద్వారా ఎయిరిండియాను కోరారు. దీనికి ఎయిరిండియా సమాధానమిచ్చింది. 2019, నవంబరు 30 వరకు ప్రభుత్వం ఎయిరిండియాకు రూ.822కోట్ల బకాయిలు పడినట్లు తెలిపింది. వీటికి తోడు తరలింపు కార్యక్రమాల కోసం విమానసేవలు అందించినందుకు గాను మరో రూ.9.67కోట్లు, విదేశీ ప్రముఖులను తీసుకెళ్లినందుకు రూ.12.65కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.236.16కోట్లు బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *