ప్రొఫసర్ చెంప చెల్లు మనిపించిన విద్యార్థిని

విద్యార్థినులను చూస్తే చాలు… ఎప్పుడు అత్యాచారం చేద్దామా… ఎప్పుడు చేతులు వేద్దామా అని ఎదురుచూస్తున్నారు కొందరు కరోడా గాళ్లు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్ల ముసుగులో వాళ్లు చేస్తున్న అరాచకాలతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు బాధిత అమ్మాయిలు. ఈ ఘటనలో బాధితురాలు ధైర్యవంతురాలు కాబట్టి… ప్రొఫెసర్ తిక్క కుదిర్చింది. ఇలాంటి వేధింపులు ఎదుర్కొనే యువతులకు ఆమె ఓ ఇన్స్‌పిరేషన్ అనుకోవచ్చు. అసలేం జరిగిందంటే… మహారాష్ట్ర… బాంద్రాలో 19 ఏళ్ల ఆ బాధితురాలు… బీఏ చదువుతోంది. హిస్టరీ ఎగ్జామ్‌ రాసేందుకు ఎగ్జామ్ హాల్‌‌కి వెళ్లింది. తన హాల్ టికెట్ నంబర్ ఆధారంగా… తాను ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుంది. టైమ్ మధ్యాహ్నం 12.15 అయ్యింది. బెల్ మోగింది. విద్యార్థులంతా ఎవరి ప్లేసుల్లో వాళ్లున్నారు. అందరికీ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. ఆన్సర్ షీట్లు ఇచ్చారు. మధ్యాహ్నం 12.30 అయ్యింది. ఎగ్జామ్ మొదలైంది. అందరితోపాటూ… ఆమె కూడా రాయడం మొదలుపెట్టింది.

దాదాపు 1 గంట అవుతున్న సమయంలో ఈ ఘటనలోని విలన్ తన నిజమైన పాత్రను బయటపెట్టాడు. ఆయనో ప్రొఫెసర్. ఎగ్జామ్ సూపర్‌వైజర్‌గా ఉన్నాడు. మిగతా అమ్మాయిల హాల్ టికెట్లపై నంబర్లను చెక్ చేస్తూ… బాధితురాలి దగ్గరకు వచ్చాడు. ఏదీ సంతకం పెడతా…. అంటూ… తన చెయ్యిని… ఆమె చెస్ట్‌కి ఆనిస్తూ పోనిచ్చాడు. షాకైన ఆ యువతి… చాలా భయపడింది. కావాలని చేశాడా… అనుకోకుండా జరిగిందా అని కన్‌ఫ్యూజ్ అయ్యింది. పెద్ద కళ్లతో అలా చూడసాగింది. సంతకం పెట్టేసి… హాల్ టికెట్ అంటూ హాల్ టికెట్ తీసుకొని… దాన్ని ఇస్తూ… మరోసారి ఆమె చెస్ట్‌‌ని ఆనిస్తూ చెయ్యిని పోనిచ్చాడు. అంతే ఆమె ఒక్కసారిగా లేచి… చెంప చెళ్లుమనిపించాలి అనేంత కోపంగా చూసింది. దాంతో ఎందుకైనా మంచిదనుకుంటూ… మొహం మాడ్చుకొని… అక్కడి నుంచీ జారుకున్నాడు.

ఆ తర్వాతి నుంచీ ఆమె ప్రొఫెసర్ వైపు కోపంగానే చూస్తుంటే… అతను కూడా అంతే కోపంగా ఆమెవైపు చూడసాగాడు. ఫుల్ అప్‌సెట్ అయిన ఆమె… చాలా వేగంగా ఏదో రాసీ రాయనట్లుగా ఎగ్జామ్ రాసి… అక్కడి నుంచీ బయటికొచ్చేసింది. తిన్నగా ప్రిన్సిపల్ రూంకి వెళ్లింది. ఆ టైంలో ప్రిన్సిపల్ లేకపోవడంతో… ఖార్ పోలీసులకు కాల్ చేసింది. వాళ్లు వచ్చి… కంప్లైంట్ రాసుకున్నారు. IPCలోని సెక్షన్ 354 (A) లైంగిక వేధింపుల కింద కేసు రాశారు. ఎగ్జామ్ హాల్‌లోని మిగతా విద్యార్థుల స్టేట్‌మెంట్లు కూడా తీసుకున్నారు. ఇక్కడ నిందితుడు ప్రొఫెసర్ కావడంతో… ఆయన్ని గౌరవప్రదంగా అదుపులోకి తీసుకున్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *