ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధ్రువీకరణ పత్రాలు: ఎన్నికల కమీషనర్

కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంబంధించిన పత్రాలు జారీ చేయడంలో ఫాస్ట్ ట్రాక్ విధానంలో జారీ చేయాలని ఆదేశించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఇందుకోసం ఇప్పటికే జిల్లాలలో ప్రత్యేక సీనియర్ అధికారులను నియమించామని, వారు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారన్నారు. జిల్లా కలెక్టర్ లతో సమన్వయం చేసుకుంటూ, ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వపధకాలు నిలుపుదల చేయాలని గతంలో చెప్పామని తెలిపారు.

ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు చేసుకోవచ్చుని తెలిపారు. అది ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కలెక్టర్లతో పాటుగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా ఎన్నికలు పూర్తి ప్రశాంతంగా నిర్వహించేలా సహకారాన్ని అందించాలని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంబంధించిన పత్రాలు జారీ చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగా వ్యవరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *