ఫిబ్రవరి 5 కొరకు కాజల్ ఎదురుచుపులు

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం మ్యూజియం కు చెందిన ఆర్టిస్టులు వచ్చి మరీ కాజల్ కొలతలు తీసుకుని వెళ్లారు. ఇప్పటికే కాజల్ మైనపు విగ్రహం రెడీ అయ్యిందట. ఆ మైనపు విగ్రహం ఎలా ఉంటుందా అనే ఆసక్తి కాజల్ అగర్వాల్ అభిమానులతో పాటు కాజల్ అగర్వాల్ లో కూడా ఉందట.

తాజాగా ఆ విషయాన్ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంది. ఈనెల 5వ తారీకున మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయం ఆమెకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందట. ఫిబ్రవరి 5వ తారీకున అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. ప్రముఖ స్టార్స్ కు మాత్రమే దక్కిన ఈ అరుదైన గౌరవం కాజల్ కు దగ్గడం నిజంగా ఆశ్చర్యం అని చెప్పాలి. ఎంతో మంది బాలీవుడ్.. సౌత్ హీరోయిన్స్ ఉండగా కాజల్ కు ఈ గౌరవం దక్కింది.

టాలీవుడ్ నుండి ఇప్పటికే మహేష్.. ప్రభాస్ ల మైనపు విగ్రహాలు మేడం టుస్సాడ్స్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వారితో పాటు కాజల్ కు కూడా ఆ గౌరవం దక్కింది. ఇండియాకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కిన గౌరవం ఇప్పుడు కాజల్ కు దక్కింది. ఈనెల 5వ తారీకున మేడమ్ టుస్సాడ్స్ లో విగ్రహ ఆవిష్కరణకు కాజల్ సింగపూర్ వెళ్లబోతుంది. ఆ ఆనంద క్షణాల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కాజల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *