ఫోన్ మార్చిన ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్

వారెన్ బఫెట్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో చాలాకాలం పాటు నెంబర్ 1 పొజిషిన్ లో వారెన్ బఫెట్ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ఇకపోతే ఈయన ఎట్టకేలకు చాలా రోజుల తరువాత తన ఫోన్ మార్చేశారు. పాత ఫ్లిప్ ఫోన్ పక్కన పడేసి.. కొత్త ఐఫోన్ 11(iphone 11) కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. అదేంటి అయన కొన్నది కేవలం ఐఫోన్ కదా.. అందులో అంత గొప్ప విషయం ఏముందనే సందేహం మీకు రావొచ్చు. కానీ ఇది ఒక అద్భుతమే అని చెప్పాలి.

సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్ హెవెన్ ఫ్లిప్ ఫోన్ను పక్కకు పడేసి తాజాగా ఐఫోన్ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్ 11లో ఏ రకం మోడల్ ఉపయోగిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. నా ఫ్లిప్ ఫోన్ పర్మినెంట్ గా పోయింది. నెంబర్ కూడా మారింది. మీరిప్పుడు 89ఏళ్ల కొత్త బఫెట్ ను చూస్తున్నారు. ఇకపై ఇదే నా కొత్త ఫోన్ అని ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ స్వయంగా చెప్పుకుని మురిసిపోయారు.

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ దీనిపై స్పందించారు. చాలా కాలం నుంచి బఫెట్కు కొత్త ఫోన్ కొనాలని సూచించానని.. ఇప్పుడు ఆయన ఐఫోన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా కొత్త ఐఫోన్ కొన్నా కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగిస్తానని అందులోని ఆప్షన్ల జోలికి వెళ్లనని వారెన్ బఫెట్ తెలిపారు. బఫెట్ వద్ద ప్రస్తుతం ఐపాడ్ కూడా ఉంది. ఇకపోతే యాపిల్ కంపెనీలో 5.6శాతం వాటాను వారెన్ బఫెట్ కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు.. 70 బిలియన్ డాలర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *