బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. సంతానం మాత్రం మైనర్ బాలుడితోనట

ఇప్పటివరకూ ఎప్పుడూ వినని కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. కొన్నింటిని వింటే ఆశ్చర్యం.. అంతకు మించిన షాకింగ్ కు గురి చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఉన్న ఈ కొత్త రిలేషన్స్ డిజిటల్ యుగానికే ప్రత్యేకంగా చెప్పాలేమో. విన్నంతనే నిజమా? అని ప్రశ్నించటమే కాదు.. వాస్తవాన్ని ఒప్పుకోవటానికి మనసు ఒప్పుకోని సిత్రమైన ఒక ఉదంతం బయటకు వచ్చింది. సెక్స్ విషయంలో సమాజం వ్యవహరిస్తున్న తీరు భయాందోళనలకు గురయ్యేలా చేయటమే కాదు.. రానున్న రోజుల్లో పరిస్థితి మరెలా ఉంటుందో ఊహించటానికి సైతం ఇష్టపడని రీతిలో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి.

ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా అలాంటిదే. యూకేకు చెందిన ఒక యువతికి ఇరవై ఏళ్లు. ఆ మధ్యన గర్భం దాల్చిన ఆమె.. తాజాగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆమె బాయ్ ఫ్రెండ్ కు ఏదో అనుమానం. దీంతో.. పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. అతగాడి అనుమానం నిజమైంది. ఆ బిడ్డ డీఎన్ఏ అతగాడి డీఎన్ఏ తో మ్యాచ్ కాలేదు. దీంతో షాక్ తిన్న అతగాడు.. మరి.. ఆ బిడ్డ ఎవరి కారణంగా పుట్టాడు? తండ్రి ఎవరు? అన్న ఆరా తీయగా షాకింగ్ నిజం బయటకు వచ్చింది.

కట్ చేస్తే.. మూడేళ్ల వెనక్కి వెళ్లాలి. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన ఆ యువతికి అప్పట్లో 17 ఏళ్లు. మద్యం మత్తులో తన బంధువుల ఇంటికి అనుకొని వేరే వారింటికి వెళ్లింది. అక్కడ పదమూడేళ్ల కుర్రాడు వీడియో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆమె.. ఆ బాలుడి మీద లైంగిక దాడి చేసింది. ఆమె చేస్తున్న పనికి అతడు కూడా అభ్యంతరం చెప్పలేదు.

అప్పటి నుంచి ఆమె ఆ బాలుడి తోనూ సెక్స్ చేయటం షురూ చేసింది. నెలకు రెండుసార్లు చొప్పున రెండేళ్ల పాటు ఆ యువతి మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొంది. దాని పుణ్యమే.. ఆమె గర్భవతి అయి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ అనుమానంతో ఆ బాలుడికి డీఎన్ఏ పరీక్షలు జరపగా.. బిడ్డకు తండ్రి అతడేనని తేలింది. అయినప్పటికి తన బిడ్డకు తండ్రి ఆ మైనర్ బాలుడు కాదే కాదంటూ ఆ యువతి వాదిస్తుండటం గమనార్హం. ఇప్పుడీ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *