బిజీ బిజీగా భూమి

భూమి పడ్నేకర్.. 2019-20 సీజన్ లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన బ్యూటీ. 2014లో `దమ్ లగా కే హైసా` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి తొలి ప్రయత్నమే భారీగా ప్రయోగం చేసింది. ఉభకాయం సమస్యతో బాధపడే అమ్మాయిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి చిత్రానికి ముందు ఆమె యష్ రాజ్ కంపెనీలో ఆరేళ్ల పాటు కాస్ట్యూమ్ అసిస్టెంట్ గానూ పనిచేసిన విషయం తెలిసిందే. `దమ్ లగా కే హైసా` సక్సెస్ అయినా ఆమెకి ఛాన్స్ లు క్యూ కట్టలేదు. లావుగా ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఆ తర్వాత భారీగా బరువు తగ్గి అందరిని ఆశ్చర్య పరిచింది. చాలా హాట్ గానూ తయారైంది. దీంతో ఈ బ్యూటీ హీరోలు.. డైరెక్టర్స్ కళ్లలో పడింది. అటుపై ఆఫర్స్ వెల్లువ మొదలైంది. 2017 నుంచి బిజీ హీరోయిన్ అయి పోయింది.

గతేడాది ఏకంగా నాలుగు సినిమాలతో సందడి చేసింది. అందులో `పతి పత్ని ఔర్ వాహ్` చిత్రం మంచి విజయాన్ని సాదించింది. ఈ ఏడాది ఇప్పటికే `శుభ్ మంగల్ జ్యాదా సావధన్`.. `భూత్-పార్ట్ వన్ః ది హంటెడ్ షిప్` చిత్రాలతో నటిగా మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా భూమీ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఎరుపు రంగు చీర కట్టుకుని డీసెంట్ గానే అందాలను ఆవిష్కరిస్తూ.. ఓ వైపు చిలిపిగా.. కవ్వింపు గా చూస్తోంది. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కుర్రకారు మాత్రం చీరలోని ఆమె అందాలకు ఫిదా అవ్వని వారు లేనే లేరంటే అతిశయోక్తి లేదు. అంతేకాదు కళ్ళర్పకుండా ఆమె అందాలను ఆస్వాధించేస్తున్నారు ఫ్యాన్స్.

కెరీర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం భూమి `డాలీ కిట్టీ ఔర్ వాహ్ చమక్త్ సితారె`.. `దుర్గావతి చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `దుర్గావతి` తెలుగులో అనుష్క కథా నాయికగా వచ్చిన `భాగమతి`కి రీమేక్ కావడం విశేషం. అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భూమి బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *