బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు

వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ
ఉత్తరాంధ్ర, రాయలసీమల వెనుకుబాటును మరోసారి గణాంకాల సహా వివరించిన బీసీజీ
రాష్ట్రంలో అభివృద్ధి అసమతుల్యానికి కారణం ప్రధానంగా నీరేనని స్పష్టం చేసిన బీసీజీ
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి – పెన్నాబేసిన్ల అనుసంధానం అవసరాన్ని నొక్కిచెప్పిన బీసీజీ
ఎకనామిక్స్‌ పరిభాషలో ఈ సాగునీటి ప్రాజెక్టులమీద ఖర్చు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ ఆపర్ట్యూనిటీ కాస్ట్‌గా దీన్ని పేర్కొన్న బీసీజీ
అంటే రాజధాని ఎక్కడున్నా దానిమీద పెట్టే లక్ష కోట్ల రూపాయల వ్యయం కన్నా, ఆ పెట్టుబడుల్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రాధాన్యతా రంగాలకు మళ్లిస్తే ప్రాంతీయ అసమానతలు శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందన్న బీసీజీ

13 జిల్లాల్లో అభివృద్ధికి పలు సూచనలు చేసిన బీసీజీ
కృష్ణాడెల్టా, ప్రస్తుత రాజధాని ప్రాంతం అభివృద్ధికి కూడా సూచనలు చేసిన సంస్థ
ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న 2.5 లక్షల కోట్ల అప్పును ప్రస్తావించిన బీసీజీ
ప్రపంచవ్యాప్తంగా గడచిన 50ఏళ్లలో గ్రీన్‌ ఫీల్డ్‌సిటీలు, వాటినుంచి వస్తున్న ఫలితాలను గణాంకాలతో విశ్లేషించిన బీసీజీ
అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు మూడు రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణలు ఉన్న వాటిని ప్రస్తావించిన బీసీజీ

మెగాసిటీలకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది
మస్దర్‌లో ప్రతి 10వేల మంది ప్రజలు నివాసం ఉండడటానికి 4.2 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు
మలేసియాలో ఫారెస్ట్‌సిటీలో ప్రతి 10వేల మంది నివాసం ఉండడటానికి 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేశారు
ప్రపంచవ్యాప్తంగా 32 గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలను యాభైఏళ్లలో నిర్మిస్తే వాటిలో రెండు తప్ప మరే నగరాలూ 50శాతం లక్ష్యాలను కూడా చేరుకోలేదు
మిగిలిన 30 నగరాలు కూడా విఫలం అయ్యాయన్న బీసీజీ
చైనాలోని షెన్జన్, ముంబై పక్కన ఉన్న నవీముంబై మాత్రమే అనుకున్న విధంగా ముందుగు సాగుతున్నాయి
షెన్జన్‌ పక్కనే హాంకాంగ్‌ ఉండడం వల్ల, నవీముంబై పక్కనే ముంబై ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది
అక్కడ భూమిలేకపోవడం, విస్తరణకు మరో అవకాశం లేకపోవడంతో వీటిని అనుకుని ఈ నగరాలు వృద్ధి చెందాయి
దుబాయ్‌లో 40 ఏళ్లలో సీఏజీఆర్‌ కేవలం 7శాతం
సింగపూర్‌లో 53 ఏళ్లలో సీఏజీర్‌ 2 శాతం
హాంకాంగ్‌ 60 ఏళ్లలో సీఏజీఆర్‌ 2 శాతం
రాజధానికోసం కొత్త నగరాలను నిర్మించినంత మాత్రాన ఆర్థికంగా ఆ నగరాలు ముందుకెళ్లాయనడం భావ్యంకాదు
బర్మాలో 2006 నాటికి సిద్ధమైనా ఇప్పటికీ 33 శాతం జనాభా లక్ష్యాన్ని దాటలేదు
మలేసియాలోని పుత్రజయ 1999లో సిద్ధమైనా ఇప్పటికీ 20శాతం లక్ష్యాన్ని దాటలేదు
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 2045 నాటికి 1.2లక్షల కోట్లు జీడీపీ ఉంటుందని అంచనాలేశారు
2045 నాటికి 15 లక్షల నుంచి 20 లక్షల మంది వరకూ వస్తారని చెప్తున్నారు
ఇలా సాధించాలంటే అమరావతి సీఏజీఆర్‌ 15 నుంచి 16శాతం ఉండాలి
కాని దుబాయ్‌ లాంటి సిటీ 7శాతం సింగపూర్‌ లాంటి సిటీ 2 శాతం దాటి సీఏజీఆర్‌ సాధించలేదు
గణాంకాలు చూస్తే రాష్ట్ర ఆదాయంలో 10శాతం ఖర్చు చేసుకుంటూ పోతే పాతికేళ్ల తర్వాత ఏడాదికి రూ.8వేల నుంచి రూ.12వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.1 లక్షల కోట్లు కావాలని సీఆర్డీయే చెప్తోంది
ఎకరం కనీసం రూ.20 కోట్లకు అమ్మితే తప్ప లక్ష కోట్లు రాదు
అమరావతి నిర్మాణంకోసం ఖర్చుచేసే వచ్చే 10–15 ఏళ్లలో చేసే ఖర్చుపై రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది
పైగా ప్రతి ఏడాది కనీసం రూ. 6–8వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది
ఇంత డబ్బు అమరావతిపై పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది
ఇవే డబ్బులు ఇరిగేషన్‌ లాంటి ప్రాధాన్య రంగాలపై పెడితే ఐదేళ్లలో రిటర్న్‌ వస్తాయి, రిస్క్‌కూడా చాలా తక్కువ
అమరావతిలో హైటెక్‌ అగ్రి కల్చర్‌ పద్ధతులతో బలోపేతానికి అవకాశాలు
హైటెక్‌ అగ్రికల్చర్‌ ప్రాంతంగా అమరావతిని పరిశీలించవచ్చు
నల్లరేగడి నేలల్లో ఎగుమతి చేయదగ్గ వ్యవసాయ ఉత్పత్తులు
రెడీ టు ఈట్, సీఫుడ్‌ ప్రాససింగ్‌లతో అమరావతి ప్రాంతాన్ని పటిష్టం చేయవచ్చు
ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతికి అవకాశాలున్నాయి

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై రెండు ఆప్షన్లు సూచించిన బీసీజీ

అసలు సచివాలయానికి ఎవరెవరు ఏయే పనులపై వస్తారు? ఎంత వస్తారన్న దానిపై ఆసక్తికర విశ్లేషణ చేసిన బీసీజీ
ఏడాది మొత్తం లక్షమంది సచివాలయానికి వస్తే అందులో 75శాతం మంత్రి కేవలం ముఖ్యమంత్రి సహాయనిధికోసమే గతంలో వచ్చారన్న బీసీజీ
ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలామంది సచివాలయానికి వస్తున్నారన్న బీసీజీ
కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునేవారు, ప్రభుత్వంలో ఉన్న పెండింగు బిల్లులకోసం వచ్చేవారు అత్యధికమని స్పష్టంచేసిన బీసీజీ
ప్రాంతీయంగా ఈ పనులను జరిగేలా చూసుకుంటే సరిపోతుందన్న బీసీజీ

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలన్నీ మొదటి ప్రాధాన్యతా నగరమైన విశాఖలో ఉండేట్టుగా చూసుకోవడం హేతుబద్ధమైందన్న బీసీజీ. లేకపోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేట్టుగా చూసుకోవాలన్న బీసీజీ.
దీంతో పాటు రెండు ఆప్షన్లతో సిఫార్సులు చేసిన బీసీజీ.
ఆప్షన్‌ 1 :
విశాఖపట్నం : గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌
విశాఖలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ
అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచి

అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి మూడు హెచ్‌ఓడీ కార్యాలయాలు, అగ్రికల్చర్‌కు సంబంధించి నాలుగు హెచ్‌ఓడీ కార్యాలయాలు, సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

ఆప్షన్‌ 2:

విశాఖ: సచివాలయం, గవర్నర్‌ – సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *