బుట్ట బొమ్మపై బన్ని ఎమోషనల్

అల వైకుంఠపురములో ఎంత పెద్ద హిట్టో బుట్ట బుమ్మ అంత పెద్ద హిట్టు. ఈ పాటలో బన్ని క్లాసిక్ స్టెప్పులు.. పూజా హెగ్డే అందచందాలు.. థమన్ మెలోడియస్ బీట్.. ఆ పాటను పాడిన వాయిస్.. లిరిక్.. కొరియోగ్రఫీ ఇలా ప్రతిదీ హైలైట్ అనే చెప్పాలి. ఆ గీతాన్ని బన్ని – పూజా ఎంతో ప్రేమించి చేశారు. ఈ సినిమాలో ఒక్కో పాట ఒకెత్తు అనుకుంటే బుట్ట బొమ్మ ఒక్కటీ ఒకెత్తుగా నిలిచింది.

యూట్యూబ్ లో ట్రెండ్ సెట్టర్ సాంగ్ ఇది. ఈ పాటపై మీమ్స్.. రియాలిటీ వేదికలపై అనుకరణ సహా ప్రతిదీ సంథింగ్ స్పెషల్ గా ట్రెండ్ అయ్యాయి. టిక్ టాక్ .. సోషల్ మీడియాల్లో దుమ్ము దుమారంలా దూసుకెళ్లింది. అందుకే ఇప్పుడు సినిమా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వెళ్లినా.. ఇంకా ఆ పాటను మాత్రం బన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పాటల వీడియోలని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుట్ట బొమ్మ సాంగ్ రిలీజై జోరుగా వైరల్ అవుతోంది.

ఇది ఇలా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన క్షణం నుంచీ ట్రెండ్ అవుతూనే ఉంది. బుట్టబొమ్మ పాటకు బన్నీ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో గొప్పగా పాపులరయ్యాయి. బుట్టబొమ్మ పాటకు టిక్ టాక్ లో దాదాపు 800 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇక బన్నీ స్టెప్పులను ఎంతో మంది కాపీ కొట్టి టిక్ టాక్ చేస్తున్నారు. అందుకే సాంగ్ విడుదలైన సందర్భంగా బన్ని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

“బుట్టబొమ్మ వీడియో సాంగ్ వచ్చేసింది.. దీనిపై మిలియన్ల వీడియోలు చేసిన వారందరికీ థ్యాంక్స్.. ఎంతో సంతోషంగా ఉంది.. ఆ వీడియోల్లోంచి నేను 400-500 వీడియోలు చూశాను.. మీ అందరికీ ఎప్పటికీ రుణపడే ఉంటాను“ అని ట్వీట్ చేశాడు. ఇక బుట్టబొమ్మ పాటకు శిల్పాశెట్టి- షమితా శెట్టి సిస్టర్స్ టిక్ టాక్ చేసిన సంగతి తెలిసిందే. దానిని మించి ఓ ఇద్దరు దివ్యాంగులు చేసిన స్టెప్పులు గుండెను టచ్ చేశాయని బన్ని ఆ వీడియోని ఫ్యాన్స్ కి షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *