బెంగళూరు లో ఆటో డ్రైవర్ దారుణం..

ఓ ఆటో డ్రైవర్ దారుణం చేశాడు. తల్లికి మద్యం తాగించి ఆమె కూతురు 14 ఏళ్ల ఆమె మైనర్ బాలికకు కడుపు చేశాడు. ఏకంగా తల్లియే కూతురును వాడుకోమని ఆటోడ్రైవర్ కు పర్మిషన్ ఇచ్చిన దారుణం బెంగళూరులో వెలుగుచూసింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటనలో అభశుభం తెలియని అమయాకపు బాలిక బలైంది. బాలిక ఇప్పుడు 8 నెలల నిండు గర్భిణి.

బెంగళూరులోని మాగిడి సబ్ డివిజన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ తన 14 ఏళ్ల కూతురుతో ఒంటరిగా ఉంటోంది. ఆమె అసహాయతను ఆసరాగా చేసుకున్న ఆటోడ్రైవర్ వినయ్ ఆమెకు దగ్గరయ్యాడు. మద్యం అలవాటు చేశాడు. బానిసను చేశాడు. ఇద్దరూ మందుకొడుతూ జల్సా చేసేవారు.

ఈ క్రమంలోనే వినయ్ కన్ను ఆ ఒంటరి మహిళ కూతురైన 14ఏళ్ల బాలికపై పండింది. కూతురును అనుభవించడానికి ఆ కసాయి తల్లి ఆటోడ్రైవర్ కు అనుమతి ఇచ్చేసింది. దీంతో ఆటోడ్రైవర్ ఆ 14 ఏళ్ల చిన్నారి గదిలో పడుకొని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తల్లి కూడా వాడితో పడుకోవాలని చెప్పడంతో బాలికకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. నాలుగు నెలలపాటు అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్ బాలికను గర్భవతిని చేశాడు. తల్లి పట్టించుకోకపోవడం.. ఆటోడ్రైవర్ కీచకపనికి కుమలిపోయిన బాలిక స్వయంగా అమ్మమ్మతో కలిసి పోలీస్ స్టేషన్ గడపతొక్కింది.

అయితే అప్పటికే దొంగతనం కేసులో ఆటోడ్రైవర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడం.. తల్లి పరారు కావడం జరిగిపోయింది. దీంతో 8నెలల గర్భిణి అయిన బాలిక వేదన అరణ్యరోదనైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *