బెదిరించిన నిర్మాత.. సైలెంటుగా చెక్కేసిన భామ!

ఆ భామ ఈమధ్య ఒక యువ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా రిలీజ్ అయింది.. హీరో స్వయంగా కథ రాసుకున్నా హిట్టు మాత్రం దక్కలేదు. ఫ్లాప్ అయినందుకు హీరోయిన్ కు నిరాశ తప్పలేదు. అదొక్కటే కాకుండా మరో విషయంలో నిర్మాతపై గుర్రుగా ఉందట.

సినిమా రిలీజుకు ముందు నిర్మాత ఒక లెజెండరీ దర్శకుడితో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట. ఈ ఇంటర్వ్యూలో హీరో-హీరోయిన్ పాల్గొనాల్సి ఉంది. అయితే హీరోయిన్ కు స్కిన్ ఎలర్జీ ఉండడంతో నేను ఈ ఇంటర్వ్యూలో పాల్గొనను అని చెప్పేసిందట. కానీ నిర్మాతగారు మాత్రం ఆ ఇంటర్వ్యూలో తప్పనిసరిగా పాల్గొనాలని లేకపోతే నీ హోటల్ బిల్లులు మేము కట్టమని.. నువ్వే కట్టుకోవాలని ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. అయితే ఇలాంటివాటికి బెదిరిపోయేందుకు అచ్చతెలుగు మాట్లాడే లోకల్ భామ కాదు. ఇంపోర్ట్ బ్యూటీ. అందుకే హోటల్ వారికి చెప్పా పెట్టకుండా నైసుగా రూమ్ ఖాళీ చేసి చెక్కేసిందట.

దీంతో హోటల్ మేనేజ్మెంట్ వారు నిర్మాతను సతాయించి మరీ తమ బిల్లు వసూలు చేసుకున్నారట. ఏదేమైనా ఈ విషయంలో హీరోయిన్ మాత్రం నిర్మాతపై గుర్రుగా ఉందట. తనతో ఇలా ప్రవర్తించడం సరికాదని తెలిసినా ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉండిపొయిందట. అయితే ఇలాంటి విషయాలను ఎంత దాచినా కరోనావైరస్ లా అత్యంత వేగంగా ప్రచారం అవుతాయి కదా. అలాగే ప్రచారం అయిపోయింది. నిర్మాత హెచ్చరిక.. హీరోయిన్ చలాకీతనం అన్నీ బయటకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *