బ్యాంకు ఉద్యోగి రాసలీలలు

ఓ బ్యాంకు ఉద్యోగికి చెందిన రెండు సెల్‌ఫోన్లలో దాదాపు 200 అశ్లీల వీడియోలు ఉన్నట్లు ఆయన భార్య వెల్లడించడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్‌ జయకుమార్‌ (36) పుదుకోట్టై జిల్లాలోని ఓ బ్యాంకులో క్యాషియర్‌. తంజావూరుకు చెందిన మహిళ(32)తో ఆయనకు రెండున్నర నెలల క్రితం పెళ్లయింది. ఆ సమయంలో నగలు, నగదు కట్నంగా తీసుకున్నాడు. ముందు నుంచి జయకుమార్‌ తన భార్యతో సన్నిహితంగా ఉండటం లేదు. రాత్రిళ్లు ఎప్పుడూ సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేసేవాడు. ఈ నేపథ్యంలో తనకు వెంటనే 50 సవర్ల బంగారు నగలు ఇవ్వాలని భార్యను హింసించటం ప్రారంభించాడు. దీనికి కారణమేంటో తెలుసుకుందామని భర్తకు తెలియకుండా అతడి రెండు సెల్‌ఫోన్లను భార్య పరిశీలించారు. వాటి నిండా దాదాపు 200 అశ్లీల వీడియోలు కనిపించాయి. అనేకమంది మహిళల బ్యాంకు ఖాతాల వివరాలూ ఉన్నాయి. బ్యాంకుకు వచ్చే మహిళా ఖాతాదారులు, ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే మహిళల అసభ్య వీడియోలు కనిపించడంతో ఆమె దిగ్భ్రాంతి చెందారు. ఈ విషయంలో ఆయనకు బ్యాంకులో పనిచేసే ఓ మహిళ సహకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భార్యపై ఎడ్విన్‌ జయకుమార్‌ హత్యాయత్నం కూడా చేశాడు. ఎడ్విన్‌ జయకుమార్‌ వాడుతున్న మరో 13 సెల్‌ఫోన్లలో సమాచారాన్ని డిలీట్‌ చేశాడు. వీటి ఆధారాలను అతడి భార్య బయటపెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఎడ్విన్‌ జయకుమార్‌తో పాటు అతడి తల్లి, సోదరి, బ్యాంకులో సహోద్యోగిని కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *