బ్రహ్మచారి మోడీ.. ట్రంప్ భార్యకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ లో దిగనున్నారు. ఈ మేరకు అగ్ర రాజ్యాధినేతకు ఘన స్వాగతం పలకడానికి సర్వం సిద్ధమైంది.

 ట్రంప్ భార్య కూతురు కొడుకు అల్లుడుతో సకుటుంబ సపరివారంగా భారత్ వస్తున్నారు. అమెరికాకు ప్రథమ పౌరుడు ట్రంప్ అయితే.. ఆయన భార్య మెలానియా ప్రథమ పౌరురాలు. అయితే భారత్ విషయానికి వస్తే రాష్ట్రపతిని పక్కనపెడితే ప్రధాని మోడీ ప్రథమ పౌరుడు.. కానీ మోడీకి భార్య లేకపోవడంతో ప్రథమ పౌరురాలు లేదు. ఇప్పుడు ట్రంప్ భార్యకు స్వాగతం సహా సత్కారాల విషయంలో మోడీ ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఎదురవుతోంది. మోడీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు వివాహం చేసుకొని భార్యను వదిలేసి బ్రహ్మచారిగా ఉంటున్నారు. దీంతో మోడీ ఒక్కడే ట్రంప్ ను ఆయన భార్యను ఎలా సత్కరిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ భార్యకు మోడీ బహుమతిగా ఇచ్చేందుకు ఓ అరుదైన చీరను సిద్ధం చేశారట.. ఆ చీర పేరు ‘పటోలా’. అయితే ట్రంప్ భార్యకు మోడీ చీర ఇవ్వడం కరెక్టేనా కాదా? తప్పుడు సంకేతాలు వెళతాయా అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మహిళలకు పురుషుల భార్యలతోనే చీరసారెలను ఇప్పిస్తుంటారు. అదే సంప్రదాయంగా వస్తోంది. కానీ మోడీకి భార్య లేకపోవడంతో ఇప్పుడు ఆయనే ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.

పటోలా చీర ప్రత్యేకత ఏమిటీ?
పటోలా చీర అంటే గుజరాత్ సంస్కృతి లో ఓ భాగం. చీరకు ప్రత్యేకత ఉంటుంది. చీరను పూర్తిగా చేతితోనే ఆరుగురు కలిసి నేస్తారు. ఆరు నెలలు కష్టపడితేనే చీర తయారవుతుంది. చెట్ల నుంచి తీసిన సహజరంగులనే చీరకు వాడుతారు. స్వచ్ఛమైన పట్టును ఉపయోగిస్తారు. పటోలా చీర ప్రపంచవ్యాప్తంగా గుజరాత్ కు బ్రాండ్ ను క్రియేట్ చేసింది. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా చీరలో మెరుగు తగ్గదు. ఉతికినా రంగు మారదు. 90 ఏళ్ల చరిత్ర పటోలా చీర సొంతం.. పఠాన్ లోని సాల్వి కుటుంబం ఈ చీరను తయారు చేస్తుంది. బంగారంతో తయారు చేస్తున్న ఈ ఖరీదైన చీరను మోడీ తాజా పర్యటనలో ట్రంప్ భార్యకు ఇవ్వబోతున్నాడు. సంప్రదాయవాదులు మోడీ ఇలా ఇవ్వవచ్చా ఇవ్వకూడదు అన్న వాదన వినిపిస్తున్నా.. పాశ్చాత్య అమెరికన్స్ ఇవేవీ పట్టించుకోరు కాబట్టి మోడీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *