బ్రెజిల్‌లో పడవ ప్రమాదం

అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్ ప్రాంతంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్‌ ఉపనది జారి నది గుండా వెళ్తున్న రెండస్తుల ఫెర్రి రివర్ బోట్ మునిగి 18 మందికి పైగా మృతి చెందగా.. 30 మంది కనిపించకుండా పోయినట్లు బ్రెజిల్ అధికారులు సోమవారం వెల్లడించారు. అమెజాన్ ఉపనది అయినా జారి నదిపై వెళ్తున్న ఫెర్రి శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో 18 మందికి పైగా మరణించగా, 46 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో మరో 30 మంది ప్రయాణికులు ఉన్నారని వారు కనిపించడం లేదని అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. ఇక వారి కోసం విమానాలు, హెలికాప్టర్ల, రక్షణ దళాల ద్వారా గాలింపులు చర్యలు చేపట్టినట్లు కూడా చెప్పారు.

కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బ్రెజిల్‌ నావికాదళం తెలిపింది. అమెజాన్‌ దాని ఉపనదులలో ఫెర్రి బోట్లు తరచూ ప్రయాణిస్తుంటాయని, ఈశాన్య బ్రెజిల్‌లోని అమాపా రాజధాని మకాపా నగరం నుండి ‘అన్నా కరోలిన్ 3’ అనే ఫెర్రీ పడవ శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరినా ఈ పడవ పారాలోని టారెంకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ‘అన్నా కరోలిన్‌ 3’ పడవను మరో పడవను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ఘటన నుంచి బయట పడిన వండర్లియా మోంటెరియో అనే మహిళా మీడియాతో మాట్లాడుతూ.. ‘పడవ మునిగిపోతున్నట్లు గమనించి అందరూ భయంతో కేకలు వేశారు. దీంలో అటువైపు వస్తున్న మరొ పడవలో మా అరుపులను గమనించి ఘటన స్థలానికి వచ్చింది. కాగా అప్పటికే పడవ దాదాపుగా మునిగిపోయే స్థితి చేరుకుంది’ అని చెప్పింది.

ఈ క్రమంలో తన భర్త, కుమారుడితో కలిసి తాను పడవ కిటికి గుండా తప్పించుకుని మరో పడవలోకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నామని పేర్కొంది. ఇక కొంతదూరం వెళ్లి వెనక్కి చూసే సరికి పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆమె వివరించింది. కాగా కళ్లేదుటే రెప్పాపాటులో జరిగిన ఈ ఘటన నుంచి తాను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని. ఈ పడవ ప్రమాదం.. ‘టైటానిక్‌’ సినిమాను తలపించేలా ఉందని చెప్పింది. కాగా ప్రమాదానికి గురైనా ఈ ప్రాంతం చాలా మారుమూలలో ఉన్నందున రెస్క్యూ హెలికాప్టర్లు రావడానికి తొమ్మిది గంటలు సమయం పట్టిందని అధికారలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *