భారత్ లో ఆ సేవల్ని బంద్ చేసిన గూగుల్

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ కోట్లాది మంది ఎంగేజ్ అయ్యే వాటిల్లో కీలకం గూగుల్. ఇవాల్టి రోజున పూట గడవాలంటే గూగుల్ లేకుండా సాధ్యం కాని పరిస్థితికి వచ్చేశాం. అంతలా మన జీవితాల్లో భాగస్వామ్యమైన గూగుల్.. దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్నికల్పించే ప్రాజెక్టును కొన్నేళ్ల క్రితం మనం అడగకుండానే షురూ చేసింది.

ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టును భారత్ లో తాము కొనసాగించలేమని తేల్చేసింది. ఎందుకిలా? అన్న ప్రశ్న వేయటానికి ముందే గూగులే అసలు విషయాన్ని చెప్పేసింది. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. భారత్ లో డేటా ధరలు కారుచౌకగా ఉన్నాయని.. అలాంటప్పుడు ఉచిత వైఫై అందివ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇతరదేశాలతో పోలిస్తే ఇంటర్నెట్ సేవలు చౌకగా మారిన వేళ.. దేశంలోని రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫైని తీసివేయాలని తాము నిర్ణయించినట్లుగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ గుప్తా తెలిపారు. భారత్ తో పాటు దక్షిణాఫ్రికా.. నైజీరియా.. థాయ్ లాండ్.. ఫిలిప్పీన్స్.. మెక్సికో.. ఇండోనేషియా.. బ్రెజిల్ దేశాల్లోనూ గూగుల్ స్టేషన్లను ఎత్తేస్తున్నట్లుగా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *