భారీగా రైళ్లు రద్దు చేసిన ద.మ. రైల్వే

ముద్కేడ్‌-పర్బని సెక్షన్‌లోని మిర్కాల్‌-లింబిగావ్‌ స్టేషన్ల మధ్య డబ్లింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

మేడ్చల్‌-హెచ్‌ఎ్‌సనాందేడ్‌ (నెంబర్‌: 57593) రైలు ఫిబ్రవరి 9 నుంచి 16 వరకు రద్దు.
పూర్ణా-హైదరాబాద్‌ (నెంబర్‌: 57548) రైలు ఫిబ్రవరి 9 నుంచి 14 వరకు రద్దు.
హెచ్‌ఎస్‌ నాందేడ్‌-మేడ్చల్‌ (నెంబర్‌: 57594) రైలు ఫిబ్రవరి 9 నుంచి 16 వరకు రద్దు.
హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ (నెంబర్‌: 57549) రైలు ఫిబ్రవరి 9 నుంచి 14 వరకు రద్దు.
ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ (నెంబర్‌: 57550) రైలు ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు రద్దు.
హైదరాబాద్‌-పూర్ణా (నెంబర్‌: 57547) రైలు ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు రద్దు.

పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు…
కాచిగూడ-నాగర్‌సోల్‌ (నెంబర్‌: 57561) రైలు ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు మల్కేడి-నాగర్‌సోల్‌ మధ్య రద్దు.
నాగర్‌సోల్‌-కాచిగూడ (నెంబర్‌: 57562) రైలు ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు పర్బని-కాచిగూడ మధ్య రద్దు.
కాచిగూడ-నర్కేర్‌ (నెంబర్‌: 17641) రైలు ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు నాందేడ్‌-నర్కేర్‌ మధ్య రద్దు.
నర్కేర్‌-కాచిగూడ (నెంబర్‌: 17642) రైలు ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు బాస్మత్‌-కాచిగూడ మధ్య రద్దు.
హైదరాబాద్‌-పూర్ణా (నెంబర్‌: 57547) రైలు ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు పర్భని-పూర్ణా మధ్య రద్దు.
హైదరాబాద్‌-పర్బని (నెంబర్‌ 57563) రైలు ఫిబ్రవరి 9 నుంచి 14 వరకు నాందేడ్‌-పర్భని మధ్య రద్దు.
కాచిగూడ-అకోలా (నెంబర్‌: 17639) రైలు 10వ తేదీన నాందేడ్‌-అకోలా మధ్య రద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *