భార్య.. మేనల్లుడి తో కలిసి దారుణం..

మనిషిలో మానవత్వం మాయమవుతుందా? బంధాలకు మాయని మచ్చలా మారేలా చేస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం సంచలనం గానే కాదు.. ఎవరిని నమ్మకూడదన్న భావన కలిగేలా చేస్తుంది. కట్టుకున్న భార్య.. మేనల్లుడితో కలిసి యాభై ఏళ్ల వ్యక్తి చేసిన దారుణం వినేందుకే విడ్డూరం గా ఉండటమే కాదు.. నమ్మినోళ్ల పై మరీ ఇంత దారుణానికి పాల్పడతారా? అన్న భావన కలిగేలా చేసింది.

హైదరాబాద్ లో నివసిస్తున్న ఒక సంపన్న మహిళ గతం లో అమెరికా లో ఉండేవారు. అప్పట్లో ఫేస్ బుక్ ద్వారా కర్ణాటక లోని బీదర్ కు చెందిన లాయర్ మామిడి సంజీవరెడ్డి (50) పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ ఫ్రెండ్ కాస్తా ఫోన్ లో మాట్లాడుకునే వరకూ వెళ్లటం.. బాధితురాలు 2018 అక్టోబరులో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ కు వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకొని.. తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు నిందితుడు.

తర్వాత హోటల్లో భోజనాలకు ఫ్యామిలీతో పాటు వెళ్లారు. నిజాంపేటలో తమ ఇంటికి తీసుకెళ్లిన సంజీవరెడ్డి.. అక్కడ ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చారు. అందులో మత్తుమందు కలపవటం తో మత్తులోకి మునిగి పోయారు. ఆ సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు సంజీవ రెడ్డి. ఆ దారుణాన్నిభార్య.. మేనల్లుడితో కలిసి వీడియో తీశాడు. దాన్ని అడ్డుగా పెట్టుకొని డబ్బులు వసూలు చేయటం షురూ చేశాడు.

తాము కోరినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియా లో పోస్టు చేస్తానని బెదిరించటం తో ఆమె దాదాపు రూ.50 లక్షల వరకూ నగదును.. బంగారాన్ని ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు తగ్గక పోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సంజీవ రెడ్డి ని.. అతని భార్యను.. మేనల్లుడి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *