భూ వివాదంలో ఎంపీ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి మెడకు ఓ భూ సమస్య చుట్టుకుంటోంది. కేసీఆర్ ను టీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించే రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా అని కాచుకుకూర్చున్న కేసీఆర్ అండ్ కో తాజాగా ఓ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయించింది. ఇప్పుడు అది ఆయన మెడకు చుట్టుకుంది.

హైదరాబాద్ లోనే ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గోపనపల్లి వద్ద సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇందులో 6 ఎకరాల 7 గుంటలు రేవంత్ రెడ్డి అక్రమ మార్గంలో కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై కొల్లా అరుణ అనే మహిళ 2017లో హైకోర్టుకెక్కింది. రేవంత్ రెడ్డి ఈ భూములను అక్రమ మార్గంలో కొనుగోలు చేశారని.. అవి మా భూములు అని వాదించింది.

దీంతో ఈ వివాదాన్ని క్యాష్ చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ వర్గాలు ఈ భూములపై విచారణ జరిపించాయి. కలెక్టర్ నివేదిక ప్రకారం.. తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి.. అనంతరం రేవంత్ రెడ్డి తెలివిగా వారి నుంచి కొనుగోలు చేశారని.. తప్పుడు పత్రాలు సృష్టించారని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దీనికి అప్పటి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సహకరించారని దర్యాప్తు లో తేలింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది.

ప్రస్తుతం ఈ భూములపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపుతున్నారు. ఈ విచారణ లో మరిన్ని విషయాలు బయటపడే చాన్స్ ఉంది. తప్పుడు పత్రాలతో కొన్నట్టు తేలితే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *